మేకల పెంపకంలో అధిక లాభాలు

 మేకల పెంపకంలో అధిక లాభాలు

పాడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోది తెలిపారు. మన్​ కీ బాత్​ లో ప్రధాని మోదీ పశువుల కాపరులనుద్దేశించి మాట్లాడారు.  ఆవులు, గేదెలతో పాటు.. రైతులు మేకల పెంపకంపై దృష్టి సారించాలని  తెలిపారు.  మేకల పెంపకం వలన రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉందని ప్రధాని అన్నారు. ప్రస్తుతం దేశంలో  ఆవులు, గేదెల పెంపకంతో పోలిస్తే మేకల పెంపకంలో భారీ వ్యత్యాసం ఉందన్నారు.  ఇప్పుడిప్పుడే మేకల పెంపంకం పట్ల రైతులు ఆశక్తి చూపుతున్నారంటూ....నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద పశుపోషణ కోసం రుణాలు కోరుతున్న వారిలో అత్యధిక సంఖ్యలో మేకల పెంపకందారులు ఉన్నారు.  లోన్​ కోపం మొత్తం 22 వేల దరఖాస్తులు రాగా.. అందులో 14 వేల దరఖాస్తులు మేకల పెంపకానికి వచ్చాయి. 

ఆవులు రోజుకు 2.5 లీటర్లు పాలు ఇస్తే... బీటల్ జాతి మేక  ఐదు లీటర్లు పాలు ఇస్తాయని లూథియానాలోని గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు.   ఆవుకు రోజుకు  రోజుకు ఏడు నుంచి  ఎనిమిది కిలోల మేత అవసరమైతే... మేకకు  గరిష్టంగా రోజుకు మూడు కిలోలు సరిపోతుంది. తమలపాకు జాతికి చెందిన మేక రోజుకు రెండు సార్లు పిల్లలకు జన్మనిస్తుంది.  ఒకేసారి రెండు, మూడు పిల్లలను ఉత్పత్తి చేస్తుంది.  పాల వ్యాపారం చేసే రైతులు బీటిల్​ మేకలను పెంపంకం చేస్తే అధిక ఆదాయాన్ని  పొందవచ్చని సింగ్​ తెలిపారు.  పంజాబ్​లో 100 కు పైగా మేకల ఫారాలు ఉన్నాయి.  ఆక్కడ ఎక్కువ మంది మేక పాల వ్యాపారం చేస్తున్నారు. 

మేకపాలను అనేక మందుల తయారీలో వినియోగిస్తారని మథురలోని సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఐఆర్‌జి) డైరెక్టర్ మనీష్ కుమార్ చెట్లీ తెలిపారు.  ఈ పాలు అనేక దీర్ఘకాలిక వ్యాధలను తగ్గిస్తాయి.  ఐరోపా దేశాల్లో 95 శాతం పిల్లల మందులను మేక పాలతోనే తయారు చేస్తారు. డెంగ్యూ వ్యాధి నివారణకు వాడే మందుల్లో అధికశాతం మేక పాల మిశ్రమం ఉంటుంది. క్యాన్సర్​, గుండె రోగులకు మేకపాలు చాలా ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మేకపాలల్లో తక్కువ లాక్టోస్​ ఉండటం వల్ల డయాబెటిక్​ రోగులకు ఔషధంగా ఉపయోగపడతాయి.  వీటిని తాగడం వలన అనేక ఉదర వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  

మేకల పెంపకానికి సంబంధించిన మరికొన్ని విషయాలు

  • ఆవులు మరియు గేదెల కంటే మేకలు చౌకగా ఉంటాయి. 
  • తక్కువ స్థలంలో మేకల పెంపకం చేయవచ్చు.
  • మేక పాలు ఇవ్వడం మానేస్తే, పిల్లలను మాంసం కోసం అమ్మవచ్చు.
  • మేకపాలు అమ్మడం ద్వారా ప్రతి నెలా ఎనిమిది నుంచి పది వేల రూపాయలు సంపాదించుకోవచ్చు.