ఈ ఏడాది తొలిసారి విదేశాల్లో మోడీ టూర్

ఈ ఏడాది తొలిసారి విదేశాల్లో మోడీ టూర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది తొలిసారి విదేశాల్లో పర్యటించనున్నారు. మే 2, 3, 4 తేదీల్లో జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నారు. ఈ మూడు రోజుల్లో 25 కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని, ఏడు దేశాలకు చెందిన 8 మంది ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. 50 గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ఇంటరాక్ట్ అవుతారని చెప్పాయి. వేలాది మంది ప్రవాస భారతీయులతోనూ మోడీ మాట్లాడనున్నారు. మే 2న ప్రధాని పర్యటన మొదలు కానుంది. ముందుగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లి, మే 4న తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొద్దిసేపు ఆగుతారు. తొలుత జర్మనీ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్ ఓలాఫ్ స్కాల్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బెర్లిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చలు జరుపు తారు. తర్వాత ఇండియా – జర్మనీ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరో ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు నేతలు పాల్గొంటారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మేక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్యారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చలు జరుపుతారు.