జడ్చర్ల లో ఎయిర్​పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లు : మన్నే శ్రీనివాస్​రెడ్డి

జడ్చర్ల లో ఎయిర్​పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లు : మన్నే శ్రీనివాస్​రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు:  ఎయిర్​పోర్టులకు దీటుగా రూ.41 వేల కోట్లతో రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ఆధునీకరించడం హర్షణీయమని మహబూబ్​నగర్​ ఎంపీ మన్నే శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అమృత్​భారత్​ స్టేషన్​ పథకంలో భాగంగా జడ్చర్ల రైల్వే స్టేషన్​లో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. జడ్చర్ల రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన అమృత్ భారత్  రైల్వే స్టేషన్, రైల్వే బ్రిడ్జి సుందరీకరణ పనులను వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఎంపీ శంకుస్థాపన చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ జడ్చర్ల స్టేషన్​ను అభివృద్ధి చేసేందుకు రూ.10.94 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జడ్పీ వైస్ చైర్మన్  కొడుగల్ యాదయ్య, మున్సిపల్  చైర్ పర్సన్  దోరేపల్లి లక్ష్మి, వైస్  చైర్​పర్సన్​ సారిక, రైల్వే డీఎంఈ జిషన్ అహ్మద్, ఏసీఎం భాగ్య పాల్గొన్నారు.

రైల్వే బ్రిడ్జి ప్రారంభం

పాలమూరు: రెండో రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు దూరమవుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అప్పన్నపల్లి దగ్గర ఫ్లై ఓవర్ పై నిర్మించిన రైల్వే బ్రిడ్జిని ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మహమ్మద్ వాజిద్, హైదర్, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్  రామాంజనేయులు, హనీఫ్ అహ్మద్, సాదుల్లా పాల్గొన్నారు. 

ఆర్ యూబీ పనులు షురూ

మదనాపురం: మండలంలోని ఎర్రగట్టు సమీపంలో 92వ రైల్వే గేట్​ వద్ద ఆర్ యూబీ పనులను సోమవారం ప్రారంభించారు. అజ్జకొల్లు, రామన్ పాడు, తిరుమలాయపల్లి రైతులు నష్టపోకుండా బ్రిడ్జి నిర్మించాలని రైల్వే అధికారులకు వినతిపత్రం అందించారు. జడ్పీ చైర్మన్​ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ పద్మావతి, జడ్పీటీసీ కృష్ణయ్య, హైదరాబాద్  రైల్వే డివిజన్  సూపర్​వైజర్  రవీందర్, టెక్నికల్  ఆఫీసర్  సురేశ్, తహసీల్దార్​ అబ్రహం లింకన్, నాగన్న, కృష్ణవర్ధన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, హనుమాన్ రావు పాల్గొన్నారు.

ALSO READ : నారాయణపేట మున్సిపాలిటీలో లుకలుకలు

గద్వాల స్టేషన్ ను మరింత అభివృద్ధి చేయాలి

గద్వాల: గద్వాల రైల్వే స్టేషన్  మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నాగర్ కర్నూల్  ఎంపీ రాములు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్  ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గద్వాల స్టేషన్ అమృత్  భారత్  స్టేషన్ గా ఎంపిక కావడం హర్షణీయమన్నారు. రూ.9.49 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అడిషనల్  కలెక్టర్  వెంకటేశ్వర్లు, డివిజనల్  రైల్వే ఆఫీసర్  అరుణ్ కుమార్, రైల్వే ఆఫీసర్లు పాల్గొన్నారు.