
ఈ లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఒక్కో రౌండ్లోనూ పోలింగ్ జరిగిన సెగ్మెంట్ల సంఖ్య మారుతూ వచ్చింది. కానీ.. మొన్న వెలువడిన ఫలితాలను ఆయా ఫేజ్‌ల వారీగా, పార్టీల వారీగా పరిశీలిస్తే ప్రధాని మోడీకి ప్రజల మద్దతు అంతకంతకూ పెరిగింది. ఆ గ్రోత్ ఆరో విడత వరకూ అలాగే కొనసాగింది. మొదటి దఫాతో పోల్చితే రెండో దశలో కమలదళం ఓట్ షేర్ 1.9 శాతం పెరిగింది. మూడో ఫేజ్‌లో అది 3.7 శాతానికి చేరింది. తర్వాత 6.5 శాతం నుంచి ఆరో దశలో ఏకంగా 12.8 శాతానికి వెళ్లింది. ఏడో దఫాలో మాత్రం పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకోవటంతో కమలనాథులకు ఓట్ల వాటా 7.6 శాతమే పెరిగింది. మూడో విడతలో హస్తం పార్టీకి కూడా ఓట్ షేర్ 1.9 శాతం పెరిగినా ఏడో ఫేజ్‌లో తప్ప మిగతా అన్ని దశల్లోనూ పడిపోయింది.