న్యూఢిల్లీ: పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్ ఐపీఓ కోసం సెబీకి డాక్యుమెంట్లు అందజేసింది. ముంబైకి చెందిన ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనుంది. తాజా ఇష్యూతోపాటు ప్రమోటర్ల ద్వారా 1.12 కోట్ల షేర్లను ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో అమ్ముతారు.
ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో కంపెనీ రూ. 120 కోట్ల వరకు సమీకరించవచ్చు. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణకు, యంత్రాలు, పరికరాల కొనుగోలుకు, అప్పుల చెల్లింపు వంటి వాటి కోసం ఉపయోగిస్తుంది.