పోలార్‌‌ గుడ్డెలుగులు వాటినవే చంపుకుతింటున్నయ్‌‌‌‌

పోలార్‌‌ గుడ్డెలుగులు వాటినవే చంపుకుతింటున్నయ్‌‌‌‌

పోలార్‌‌ గుడ్డెలుగులు వాటినవే చంపుకుతింటున్నయ్‌‌‌‌

వాతావరణ మార్పులెక్కువై తిండి దొరక్కపోవడం వల్లే..

భూమ్మీద నివసించే అతి పెద్ద మాంసాహార జంతువులు ధ్రువపు ఎలుగుబంట్లు. సైబీరియన్‌‌‌‌ పులి కన్నా రెండు రెట్లు ఎక్కువ బరువుంటాయి. మామూలుగానైతే ఇవి సర్వభక్షకాలు. ఎక్కువగా చేపలు, సీల్స్‌‌‌‌పై ఆధారపడతాయి. కానీ ఇప్పుడు వాటినవే చంపుకుతింటున్నాయి. ఈ మధ్యన ఇది మరీ ఎక్కువైంది. వాతావరణ మార్పులు ఎక్కువై తగినంత తిండి దొరక్క ఇలాంటి పరిస్థితి వస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆకలికి తట్టుకోలేక ఆడ, పిల్ల ఎలుగులను మగ ఎలుగులు చంపి తింటున్నాయని అంటున్నారు. ఇప్పటివరకైతే ఆర్కిటిక్‌‌‌‌ ప్రాంతాల్లో పరిశోధనలు చేసే సైంటిస్టులే ఇలాంటివి చూశామని చెప్పేవారని.. కానీ ఇప్పుడు ఆయిల్‌‌‌‌ వర్కర్లు, భద్రతా సిబ్బంది కూడా ఇలాంటి సంఘటనలు చూస్తున్నామంటున్నారని చెబుతున్నారు.

ఐస్‌‌‌‌ ముక్కలై వేటాడలేక..

ఆర్కిటిక్‌‌‌‌లోని గల్ఫ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఒబ్‌‌‌‌లో ఎలుగులు ఎక్కువగా వేటాడుతుంటాయని, కానీ వాతావరణ మార్పుల వల్ల అక్కడ ఏడాదంతా ఐస్‌‌‌‌ ముక్కలుగా విడిపోయి వేటాడలేకపోతున్నాయని సైంటిస్టులు చెప్పారు. ఈ ప్రాంతానికి పక్కనే లిక్విడ్‌‌‌‌ నైట్రోజన్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ తీసే ప్లాంట్‌‌‌‌ ఉండటం.. ఈ రెండింటినీ కలపడం, అక్కడ అలజడి ఎక్కువవడంతో సమస్య పెరిగిందన్నారు. మరోవైపు ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువుండే స్పిట్స్‌‌‌‌బర్గన్‌‌‌‌ ద్వీపం ఈసారి వేడిగాలలకు ప్రభావితమైందని, ఐస్‌‌‌‌ పలకలన్నీ కరిగిపోయాయని, తిండి దొరక్కపోవడానికి ఇదీ ఓ కారణమని చెప్పారు. ఆహారం  దొరక్క ఎలుగులు అవి వేటాడే ప్రాంతాన్ని వదిలి వలస వెళ్తున్నాయని తెలిపారు. ఇది ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు ధ్రువపు ఎలుగులు ఐస్‌‌‌‌పైన వేటాడటం కనబడదని.. ఎత్తైన కొండల ప్రాంతాలు, సముద్ర తీరాలకే పరిమితమవుతాయని చెప్పారు. అక్కడ వాటికి కావాల్సినంత ఆహారం దొరకదని, దీని వల్ల వాటి ఉనికే ప్రశ్నార్థకమవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.