బిట్​ బ్యాంక్​: హైదరాబాద్​ రాజ్యంపై పోలీసు చర్య

బిట్​ బ్యాంక్​: హైదరాబాద్​ రాజ్యంపై పోలీసు చర్య
  •      భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందు హైదరాబాద్​ నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1948 సెప్టెంబర్​ 13న స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. 
  •      భారత సైన్యాలు హైదరాబాద్​ రాజ్య సరిహద్దుల్లో మోహరించడంతో నిజాం ప్రభుత్వం భారత​ ప్రభుత్వంతో 1947 నవంబర్ 29న యథాతథ స్థితి ఒప్పందం చేసుకుంది. 
  •      యథాతథస్థితి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్​ రాజ్య విదేశీ వ్యవహారాలను 1948 నవంబర్​ 29 వరకు భారత ప్రభుత్వానికి అప్పగించారు. 
  •      భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నిజాం ఇంగ్లాండ్​, అమెరికా, ఇతర రాజ్యాల నుంచి సహకారానికి ఉత్తర  ప్రత్యుత్తరాలను జరిపారు. 
  •      ఆయుధాలు సమకూర్చుకోవడానికి నిజాం ఇంగ్లండ్​ పంపిన మిలటరీ జనరల్​ అహ్మద్​ సయ్యద్​, ఎల్​. ఎడ్రూస్​. 
  •      నిజాం ఇంగ్లాండ్​లో సిడ్నికాటన్​, హెన్రీలష్​విజ్​ ద్వారా ఆయుధాలు సరఫరాకు ఒప్పంద కుదుర్చుకున్నారు. 
  •     మందుగుండు సామగ్రి కోసం నిజాం ఒప్పందం కుదుర్చుకున్న మాజీ బ్రిటీష్​ సైనికాధికారి టి.టి.మూర్​. 
  •      భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న విదేశీ వ్యవహారాల ఒప్పందానికి విరుద్ధంగా హైదరాబాద్​ నిజాం భారత్​ సెక్యూరిటీల నుంచి పాకిస్తాన్​కు రూ.20కోట్లు రుణంగా ఇచ్చారు. 
  •      1948 ఆగస్టు 24న భారత ప్రభుత్వంపై సర్​ వాల్టర్​ మాంక్టన్​ సహాయంతో ఐక్యరాజ్యసమితికి అధికారికంగా ఫిర్యాదు చేసిన హైదరాబాద్​ రాజ్య ప్రధాన మంత్రి మీర్​ లాయక్​ అలీ. 
  •    రాజగోపాలాచారి భారత గవర్నర్​ జనరల్​గా 1948 జూన్​ 21న పదవిని చేపట్టారు. 
  •      హైదరాబాద్​ రాజ్యానికి పెద్ద మద్దతుదారుడైన పాకిస్తాన్​ మొదటి గవర్నర్​ జనరల్​ మహ్మద్​ అలీ జిన్నా.
  •      1948 సెప్టెంబర్​ 12న మహ్మద్​ అలీ జిన్నా మరణించారు.            
  •      హైదరాబాద్​ రాజ్యంపై భారత సైనిక చర్యకు ఆపరేషన్​ పోలో అని పేరు పెట్టారు. 
  •      హైదరాబాద్​ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు సాగిస్తున్న హింసా ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్​ పోలీ నిర్వహిస్తున్నట్లు పాకిస్తాన్​ హైకమిషనర్​కు, అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. 
  •      ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య చేపట్టడం ఐక్యరాజ్యసమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం కాబట్టి హైదరాబాద్​ పై భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టినప్పటికీ దానికి పోలీసు చర్య అని పేరు పెట్టారు. 
  •      హైదరాబాద్​ రాజ్యంపై సైనిక చర్యకు అయ్యే ఖర్చును విద్యా శాఖ ఖాతాలో జమ చేశారు. 
  •      హైదరాబాద్​పై సైనిక చర్య లెఫ్టినెంట్​ జనరల్​ మహరాజ్​ సింగ్​ నేతృత్వంలో జరిగింది. 
  •      హైదరాబాద్​ రాజ్యంపై షోలాపూర్​ వైపు నుంచి మేజర్​ జనరల్​ జేఎన్​ చౌదరి దాడులు చేశారు. 
  •      హైదరాబాద్​ రాజ్యంపై విజయవాడ వైపు నుంచి మేజర్​ జనరల్​ రుద్ర దాడులు చేశారు. 
  •      నిజాం రాజ్యంలో భారత ఏజెంట్​ జనరల్​ కె.ఎం.మున్షీ. 
  •      భారత సైన్యానికి ఎప్పటికప్పుడు నిజాం రాజ్య  సైన్యాధిపతి మేజర్​ జనరల్​ సయ్యద్​ అహ్మద్​ ఇఎల్​ ఎడ్రూస్​ సమాచారం అందించారు. 
  •      మేజర్​ జనరల్​ జేఎన్​ చౌదరి నేతృత్వంలోని భారత సేనలు హైదరాబాద్​ నగరంలోకి 1948 సెప్టెంబర్​ 17న ప్రవేశించారు. 
  •      నిజాం రాజ్య సైన్యాధిపతి మేజర్​ జనరల్​ ఇఎల్​ ఎడ్రూస్​ భారత మేజర్​ జనరల్​ జేఎన్​ చౌదరి ముందు 1948 సెప్టెంబర్​ 18న లొంగిపోయాడు. 
  •      నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు దక్కన్​ రేడియో ద్వారా 1948 సెప్టెంబర్​ 17న ప్రకటన చేశారు. 
  •      భారత సైన్యాలు సికింద్రాబాద్​లోని బొల్లారంలో బస చేయడానికి అనుమతిస్తున్నట్లు నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1948 సెప్టెంబర్ 17 నాటి రేడియో ప్రకటనలో పేర్కొన్నారు. 
  •      భారత ప్రభుత్వం కొత్త మంత్రి వర్గాన్ని, కొత్త  ప్రధాన మంత్రిని నియమించేంత వరకు నిజాంకు పరిపాలనలో తోడ్పడటానికి ఆరుగురితో కమిటీ వేశారు. 1. బెరార్​ యువరాజు ప్రిన్స్​ ఆజంజా, సర్వే సేనాని, 2. మేజర్​ జనరల్​ సయ్యద్​ ఇఎల్​ ఎడ్రూస్​– కమాండర్​, 3. నవాబ్​ దీన్​యార్​ జంగ్​ – పోలీస్​ కమిషనర్​, 4. జి.రామాచారి–వకీలు, 5. అబుల్​ హసన్​ సయ్యద్​ అలీ – ఇత్తేహాదుల్​ ముస్లిమీన్​ మాజీ అధ్యక్షుడు, 6. పన్నాలాల్​ పిత్తి. 
  •      సైనిక నియమాల ప్రకారం 1948 సెప్టెంబర్​ 18 నుంచి హైదరాబాద్​ పాలనా బాధ్యతలు మేజర్​ జనరల్​  జేఎన్​ చౌదరి స్వీకరించారు. 
  •       1948 సెప్టెంబర్​ 18న నిజాం  రాజ్య ప్రధాన మంత్రి లాయక్​ అలీని గృహ నిర్బంధంలో ఉంచారు. 
  •      1948 సెప్టెంబర్​ 18న హైదరాబాద్​ సంస్థానానికి వచ్చిన సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​కు నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ బేగంపేట విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.