కృష్ణ చెక్ పోస్ట్ ను పరిశీలించిన అబ్జర్వర్లు

కృష్ణ చెక్ పోస్ట్ ను  పరిశీలించిన అబ్జర్వర్లు

మాగనూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా ఎన్నికల అబ్జర్వర్  బీపీ చౌహాన్, పోలీస్  అబ్జర్వర్  ధ్రువ్  సోమవారం కృష్ణ మండలం వాసునగర్, చేగుంట బార్డర్  చెక్ పోస్ట్ లను పరిశీలించారు. పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల డ్యూటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

తనిఖీల సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలను, వాహనాల తనిఖీ రిజిష్టర్ ను పరిశీలించారు. రిజిష్టర్ లో ప్రతి వాహనం పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ALSO READ : యాసంగి సీజన్ కు సాగు నీరెట్లా?