ఆసక్తికరంగా భూపాలపల్లి పాలిటిక్స్..ఎమ్మెల్యే గండ్రకు కౌన్సిలర్ల డెడ్ లైన్

ఆసక్తికరంగా భూపాలపల్లి పాలిటిక్స్..ఎమ్మెల్యే గండ్రకు కౌన్సిలర్ల డెడ్ లైన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లిలో రాజకీయం వేడెక్కింది. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు చుట్టూ మున్సిపల్  కౌన్సిలర్ల అవిశ్వాసం రాజకీయం తిరుగుతోంది. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్లపైనా 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించడంతో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి క్యాంపు ఆఫీసులో ఏప్రిల్ 18వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ లెటర్లు ఇచ్చి వెళ్లారు. 

ఏప్రిల్ 19వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్లపై చర్యలు తీసుకోండి.. లేదా మా రాజీనామాలను ఆమోదించండి అంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అవిశ్వాసం ప్రకటించిన 20 మంది కౌన్సిలర్లు లెటర్లు ఇచ్చారు. ఎమ్మెల్యేతో అధికార పార్టీ కౌన్సిలర్లు సంప్రదింపులు జరిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ ను తొలగించకుంటే పార్టీ సభ్యత్వానికి తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని 20 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.