జీవో 317ను రద్దు చేయాలి

జీవో 317ను రద్దు చేయాలి

ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న జీవో 317ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీచర్లను సొంత జిల్లాల నుంచి బలవంతంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అన్యాయమని అన్నారు. జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయిన టీచర్లను సొంత జిల్లాలకు పంపి న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ట్రాన్స్ఫర్లు సక్రమంగా చేపట్టాలని, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని  పొన్నం ప్రభాకర్ సూచించారు. బదిలీల్లో అవకతవకలు జరిగినందున ప్రభుత్వం వెంటనే స్పందించి టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

For more new..

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు 

ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది?