రికీ పాంటింగ్ కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

రికీ పాంటింగ్ కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పెర్త్ లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ కోసం కామెంటరీ చేస్తుండగా అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. గుండె సంబంధ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు గుర్తించి... వెంటనే రికీ పాంటింగ్ ను హాస్పిటల్ తరలించారు. రికీ పాంటింగ్ కు 47 ఏళ్లు. కామెంటరీ బాక్స్ లో ఉండగా తనకు బాగాలేదని చెప్పి ఇబ్బందిపడ్డట్లు గుర్తించారు.

ఆస్ట్రేలియా – వెస్టిండీస్ టెస్ట్ లో పాంటింగ్ కామెంటరీ ఇవాళ్టికి ఉండదని మ్యాచ్ ప్రసారం చేస్తున్న చానెల్ 7 అధికార ప్రతినిధి ప్రకటించారు. పాంటింగ్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తర్వాత చెబుతామన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఇటీవలి కాలంలో గుండె  సంబంధ సమస్యలతో అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఈ ఏడాది రాడ్ మార్ష్, షేన్ వార్న్ చనిపోయారు. 

1995 నుంచి 2012 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన పాంటింగ్‌ ..168 టెస్టుల్లో 13,378 పరుగులు, 375 వన్డేల్లో 13,704 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 41 టెస్టు సెంచరీలు, 30 వన్డే సెంచరీలు ఉన్నాయి