
నారా భువనేశ్వరిపై నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేశారు. అసలు చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి భువనేశ్వరీ కారణమని వ్యాఖ్యానించారు. నటుడు పోసాని కృష్ణ మురళి. చంద్రబాబు నీతిమంతుడైతే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ ను వదిలి టీడీపీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ ను చంద్రబాబు చెప్పులతో కొట్టిస్తే భువనేశ్వరి చూసి ఆనందపడిందన్నారు కృష్ణ మురళి. తండ్రిపై చెప్పులు వేయిస్తున్నా.. వెన్నుపోటు పొడిచినా.. భర్తను ఎందుకు వెనకేసుకొచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికీ ఆమెది అదే ఆటిట్యూడ్ అని విమర్శించారు.
Also Read :- మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు
చంద్రబాబు, లోకేష్ పెద్ద మోసగాళ్లని ఆరోపించారు పోసాని కృష్ణ మురళి. నారా భువనేశ్వరికీ అన్నీ తెలిసినా మౌనంగా ఉండి భర్తను వెనకేసుకొచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా భువనేశ్వరి ఎందుకు ప్రశ్నించదన్నారు.