దేశంలో పేదరికం మెరుగుపడింది: ప్రపంచ బ్యాంక్

 దేశంలో పేదరికం మెరుగుపడింది: ప్రపంచ బ్యాంక్

భారతదేశంలో పేదరికం 12.3శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5శాతం ఉన్న పేదరికం..2019లో 10.2శాతానికి పడిపోయిందని వివరించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం చాలా తగ్గిందని తెలిపింది. అర్భన్ ప్రాంతాల్లో పేదరికం 6.3 శాతానికి తగ్గిందని పేర్కొంది. చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు పొందుతున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2శాతం మేర పెరిగిందని చెప్పింది. ఇండియాలో దశాబ్ధకాలంలో పేదరికం తగ్గింది కానీ.. అనుకున్నంతగా తగ్గలేదని చెప్పింది ప్రపంచ బ్యాంక్. 

 

ఇవి కూడా చదవండి

కర్ణాటకలో జేపీ నడ్డా పర్యటన

సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం

ప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు

ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం