ఇతర పొదుపు స్కీమ్‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే దీని వడ్డీ రేటు ఎక్కువ!

ఇతర పొదుపు స్కీమ్‌‌‌‌‌‌‌‌లతో పోలిస్తే దీని వడ్డీ రేటు ఎక్కువ!

న్యూఢిల్లీ: పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​ స్కీమ్​ (పీపీఎఫ్)​ రిటైర్మెంట్-ఆధారిత ప్రభుత్వ పథకం పెట్టుబడి పథకం. పన్ను ఆదా చేయడానికి కూడా ఇది బెస్ట్​. పీపీఎఫ్​పై వచ్చే వడ్డీ రేటును ప్రభుత్వం ముందుగానే నిర్ణయిస్తుంది. అందువల్ల, పీపీఎఫ్​ ఖాతాపై రాబడులకు ఎటువంటి రిస్కూ ఉండదు. పీపీఎఫ్​ పెట్టుబడిని రెట్టింపు చేయడానికి ఎంత సమయం పడుతుందో నిర్ణయించడానికి 72 రూల్​ ఉపయోగిస్తారు.  ప్రస్తుతం దాని పెట్టుబడిదారులకు 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే, ఈ రేటును ప్రభుత్వం ప్రతి క్వార్టర్​లో సవరిస్తారు. పీపీఎఫ్​కి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఏడేళ్ల తరువాత పార్షియల్​ విత్​డ్రాలకు అవకాశం ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఖాతాను మూసివేయవచ్చు. ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు మొదలైన ఇతర పొదుపు సాధనాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు ఎక్కువ.

పీపీఎఫ్​ పెట్టుబడిదారులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులకు అర్హులు. పీపీఎఫ్​ ద్వారా వచ్చే వడ్డీకి కూడా పన్ను ఉండదు. మీరు పీపీఎఫ్​లో రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ పెట్టుబడిని రెట్టింపు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది తెలుసుకోవడానికి 72 రూల్​ను ఉపయోగిస్తారు. పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో నిర్ణయించడానికి 72 రూల్​ సులభమైన మార్గం.  ఈ పద్ధతిని వర్తింపజేయడానికి, పెట్టుబడిదారుడు ప్రతి నెలా తప్పక ప్రీమియం చెల్లించాలి. వడ్డీరేటు స్థిరంగా ఉండాలి. ఈ విధానంలో వడ్డీరేటును 72తో భాగిస్తారు. ఇలా చేస్తే పెట్టుబడిదారులు తమ ప్రారంభ పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో స్థూలంగా అంచనా వేయవచ్చు. పీపీఎఫ్  ప్రస్తుత రాబడి రేటు 7.1శాతం. దీనిని 72తో భాగిస్తే 10.14 వస్తుంది. అంటే 10.14 ఏళ్ల చొప్పున ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ ఇస్తే పెట్టుబడి రెట్టింపు అవుతుంది.   మీరు 5 సంవత్సరాలలో మీ పెట్టుబడిని రెట్టింపు చేయాలన్నా కూడా ఈ రూల్​తో లెక్కించవచ్చు. మీరు ఐదేళ్లలో14–-15 శాతం మధ్య వడ్డీ ఇచ్చే స్కీములో ఇన్వెస్ట్ చేయాలి. మరింత కచ్చితంగా చెప్పాలంటే 14.4 శాతం వడ్డీ ఇస్తే డబ్బు రెట్టింపు అవుతుంది.

73 లక్షల మందికి ఒకేసారి పెన్షన్‌‌‌‌ 
 రిటైర్‌‌మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్​ఓ తన సెంట్రల్​ సిస్టమ్​ ద్వారా 73 లక్షల మందికి ఒకేసారి పెన్షన్​ చెల్లించనుంది. ఇందుకోసం ఈ నెల 29,  30 తేదీల్లో జరిగే తన సమావేశంలో కేంద్ర పెన్షన్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించి  ఆమోదిస్తుంది. దీనివల్ల ఒకేసారి అందరు పెన్షనర్ల డబ్బును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయవచ్చు. ప్రస్తుతం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ)కు చెందిన 138 ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రాంతంలోని లబ్ధిదారులకు వేర్వేరు తేదీల్లో పెన్షన్లను చెల్లిస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ)లో సెంట్రల్ పెన్షన్ డిస్బర్సల్ సిస్టమ్‌‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఈ సమావేశంలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ఈపీఎఫ్​ఓ వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ కార్యాలయాల సెంట్రల్ డేటాబేస్‌‌ను ఉపయోగించి పెన్షన్ ఇస్తారు. 2021 నవంబర్ 20న జరిగిన సీబీటీ 229వ సమావేశంలో, సీడాక్​ ద్వారా సెంట్రలైజ్డ్​ ఐటీ -ఎనేబుల్డ్ సిస్టమ్‌‌ల అభివృద్ధి ప్రతిపాదనను ట్రస్టీలు ఆమోదించారు.