
బ్యాక్ టు బ్యాక్ షూట్స్‌తో యమా బిజీగా ఉన్న ప్రభాస్.. ‘ఆదిపురుష్’ సినిమాని కాస్త ఎక్స్‌ట్రా స్పీడుతోనే కంప్లీట్ చేస్తున్నాడనిపిస్తోంది. ఈ సినిమా షెడ్యూల్స్‌ని చాలా పక్కాగా ప్లాన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. దాంతో ఎక్కడా గ్యాప్ లేకుండా చకచకా పనులు జరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌లో కొంత షూట్ చేశారు. నిన్న ముంబైలో చివరి షెడ్యూల్ స్టార్ట్ చేశారు. త్వరలో ఓ భారీ ఫైట్‌ను తీయబోతున్నారట. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడు రాక్షస సంహారం చేసే దృశ్యాల్ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాలోని హైలైట్స్‌లో ఒకటని చెబు తోంది టీమ్. కృతీ సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలి సిందే. వారి పాత్రల్ని కూడా అందరికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడట దర్శకుడు. ఈ చిత్రాన్ని కాస్త భారీగానే తెరకెక్కిస్తున్నారు. పెద్ద పెద్ద సెట్స్.. కాస్ట్యూమ్స్.. రథాలు, గుర్రాలు వంటి వాటి కోసమే చాలా ఖర్చవుతోందట. కోట్లతో వ్యవహారం కనుక పనిలో వేగాన్ని తగ్గనివ్వడం లేదు టీమ్. అక్టోబర్ నెలాఖరుకి సినిమా పూర్తయిపోతుందని అంటున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కావడంతో ఆరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.