పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: ఎంఎల్ ప్రజా పంథా

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: ఎంఎల్ ప్రజా పంథా

సూర్యాపేట, వెలుగు: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌కు  వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ నేరేడుచర్లలోని సర్వేనెంబర్ 243, 244లో ఉన్న ప్రభుత్వ భూమిలో  ఎనిమిడేండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలపై  పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.  

అదే ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.  సోషల్‌ ఎకనామిక్ సర్వే జరిపి అర్హులైన ప్రతి పేదవాడికి 126 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి, కార్యదర్శి ఎర్ర అఖిల్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి రామోజీ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, కార్యదర్శి కొత్తపల్లి రేణుక,  నేతలు వాసా పుల్లన్న,  హుస్సేన్, కరుణాకర్, సత్యక్క, పావని, నాగన్న, జయమ్మ, రేణుక, తదితరులు పాల్గొన్నారు.