వికీపీడియాలో యాదాద్రి యువకుడి వ్యాసాలు

వికీపీడియాలో యాదాద్రి యువకుడి వ్యాసాలు

ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే వికీపీడియా వెతుకుతాం. కావాలిస్సిన  ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాం. కానీ, ప్రణయ్ రాజ్ వంగరి మాత్రం వికీపీడియాకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ప్రతీ విషయాన్ని లోతుగా తెలుసుగా తెలుసుకోవాలనే  ఫ్యాషన్ ను  ఓ ఛాలెంజ్ లా తీసుకున్నాడు.వికీ వ్యాసాలు రాయడంలో రికార్డులు సృష్టిస్తున్నాడు. వికీ పీడియాలో ఇన్ఫర్మేషన్ రాయాలనుకునే వారికి ట్యుటోరియల్స్ చెప్పేందుకు వికీ గ్రాంట్ కు సెలక్ట్ అయిన ప్రణయ్ లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే..

మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు. చేనేత కుటుంబానికి చెందిన నాకు చిన్నప్పట్నించి కళలంటే ఇష్టం. అమ్మ బతుకమ్మ పాటలు పాడేది. రిలీజైన ప్రతి సినిమాకి వెళ్లేవాళ్లం. నాటకాలు చూసేవాళ్లం. అలా కళలపై ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మోత్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదివిన. భువనగిరిలో డిగ్రీ చేశా. అందరిలా కాకుండా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలనే ఉద్దేశం, కళలపై ఉన్న ఇష్టంతో థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు పూర్తి చేశా. ‘పాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఒక సంస్థను స్థాపించి నాటకాలు కూడా వేసేవాళ్లం. ఆ తర్వాత కొన్ని రోజులకు నాటకాలపైన తెలుగు విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టా.

అలా మొదలైంది..

నాటకాల గురించి రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న నాకు ఎక్కడా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరకలేదు. వికీపీడియా వెతికితే దాంట్లో ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటి గురించి ఉన్నాయి కానీ, తెలుగు నాటకాలకు సంబంధించిన విషయాలు లేవు. అప్పుడే విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గారు నాకు వికీపీడియా గురించి చెప్పారు. “ దాంట్లో నువ్వే వ్యాసాలు రాయొచ్చు.. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో గుర్తింపు వస్తుంది” అన్నారు. దాంతో 2013 మార్చి 8న వికీపీడియాకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టా. నాటకాల గురించి, తెలంగాణ చరిత్ర, తెలుగు రాష్ట్రాల్లోని ప్లేసులు, వ్యక్తుల గురించి రాయడం మొదలుపెట్టాను.ఇప్పటివరకు 2,900 వ్యాసాల వరకు రాశా. 

ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుని

వికీపీడియా ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏటా ‘వికీమేనియా’ అనే ఒక ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యాసాలు రాసినవాళ్లను ఆహ్వానించి సత్కరిస్తుంది. అలా 2016లో ఇటలీలో జరిగిన ‘వికీమానియా’లో నేను పార్టిసిపేట్​ చేశా. అప్పుడే నాకు 100 రోజుల ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి తెలిసింది. అంటే 100 రోజుల్లో 100 వ్యాసాలు రాయాలన్నమాట. ముందు ఆ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి విని అసాధ్యం అనుకున్నా. కానీ, తర్వాత పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే తెలుగు వికీయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదర్శంగా తీసుకుని స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశా. నేను కూడా 100 రోజుల్లో ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిచేశా. 

ఉపరాష్ట్రపతి ప్రశంసలు

365 రోజుల ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన నేను దానికి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడకుండా ఏడాదిలో 365 వ్యాసాలు రాసి వికీపీడియాలో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృష్టించాను. అది తెలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నన్ను మెచ్చుకున్నారు. ప్రతిరోజు ఒక వ్యాసం పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా. కేవలం తెలంగాణకు చెందిన విషయాలే కాకుండా ఇతర రాష్ట్రాల వారి గురించి కూడా రాస్తున్నా. 

పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద..

‘తెలుగు వికీపీడియా పాఠ్యప్రణాళిక’లో భాగంగా ముందుగా కొన్ని వీడియోలు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించిన తర్వాత మార్పులు చేసుకుని మరిన్ని వీడియోలు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలనే ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించి క్వశ్చనైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం. ఏవైనా డౌట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడగాలన్నా లేదా ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాలనుకున్నా టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్​ చేయొచ్చు.

                                                                                                                                                                             ... తేజ తిమ్మిశెట్టి