కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్ చేస్తున్రు

కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్ చేస్తున్రు

తంగళ్లపల్లి, కోనరావుపేట, వెలుగు: మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్ చేయడం సరికాదని, మంత్రి వచ్చినప్పుడల్లా మాకు ఇదేం గోసని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  ప్రవీణ్ జే టోనీ అన్నారు. ప్రతిపక్ష నేతలుగా నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్లను పోలీసులు రాత్రిరాత్రే ముందస్తు అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్, బస్టాండ్​ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ లీడర్ చుక్క శేఖర్ నల్ల బెలూన్లతో నిరసన తెలిపాడు. పోలీసులు శేఖర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. 

కోనరావుపేట, వెలుగు: కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ముంపు గ్రామాల ప్రజలు, ప్రతిపక్ష నాయకులను పట్టుకుపోవడం పోలీసులకు పరిపాటిగా మారిందని ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ ఆరోపించారు. మంగళవారం జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ముంపు గ్రామాల నాయకులను సోమవారం రాత్రి అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి కోనరావుపేట స్టేషన్ లో నిర్బంధించారు. కోనరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌‌‌‌పాషా వారిని పరామర్శించారు. 

వేములవాడ, వెలుగు:  జిల్లాలో మంత్రి కేటీఆర్​పర్యటన సందర్భంగా ముందస్తుగా బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడ అర్బన్​ మండలంలో బీజేపీ జిల్లా కార్యదర్శి, మిడ్​మానేరు జేఏసీ కన్వీనర్​ బుర్ర శేఖర్​,  బీజేవైఎం మండల అధ్యక్షుడు అఖిల్, సురేశ్‌‌‌‌గౌడ్​లను పోలీస్​స్టేషన్​ కి
 తరలించారు.