యాదాద్రి భువనగిరిలో ముందస్తు అరెస్టులు

యాదాద్రి భువనగిరిలో ముందస్తు అరెస్టులు

యాదాద్రి భువనగిరి జిల్లా : సీఎం కేసీఆర్ భువనగిరి పర్యటన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లీడర్లను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల ఐలయ్యను హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు .. స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే పలువురి బీజేపీ కార్యకర్తలను ముందుస్తు అరెస్టులు చేశారని తెలిపారు. పోలీసులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వలిగొండలో డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండలో దళిత మోర్చా రాష్ట్ర నాయకులు పోతేపక సాంబయ్యతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం

ఎవరు మీలో కోటీశ్వరులు.. ఐపీఎల్ వేలానికి వేళాయెరా!