హైదరాబాద్, వెలుగు: ప్రీమియర్ ఎనర్జీస్ 400 మెగావాట్ల సోలార్ సెల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రూ.11 వేల కోట్ల విస్తరణ ప్రణాళికలో భాగంగా మహేశ్వరంలోని ఈ– సిటీలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో కంపెనీ సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 3.2 గిగావాట్ల నుంచి 3.6 గిగావాట్లకు పెరిగింది.
దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా 2028 నాటికి సెల్ సామర్థ్యాన్ని 10.6 గిగావాట్లకు, మాడ్యూల్ సామర్థ్యాన్ని 11.1 గిగావాట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఐపీఓ నుంచి వచ్చిన రూ.1,300 కోట్లు, ఇరెడా నుంచి తీసుకున్న రూ.2,200 కోట్ల అప్పుతో ఈ విస్తరణ చేపడుతోంది.
