ప్రధానమంత్రి ఈ-విద్య

ప్రధానమంత్రి ఈ-విద్య

ప్రపంచ దేశాల్లో  విద్యా వ్యవస్థలో వస్తున్న నూతన ఒరవడికి అనుగుణంగా విద్యకు ఉపకరించబడే అనుబంధ వ్యవస్థలను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యను అందిస్తున్న క్రమంలో.. భారతదేశంలోని విద్యను అభ్యసించే విద్యార్థులకు  నాణ్యమైన,  గుణాత్మక విద్యను అందించే క్రమంలో ఈ – -విద్య ఎంతగానో  తోడ్పడుతుంది. ‘ప్రధానమంత్రి ఈ-–విద్య’ అనే పథకం ఈ కోవకి చెందినదే. ఈ పథకం ద్వారా సమాచార వనరులను డిజిటల్, ఆన్​లైన్, ఎయిర్ లైన్ ద్వారా అంటే బహుళ పద్ధతుల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. దీని వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది పాఠశాలలకు వెళ్లే  విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

18 భాషలలో..

 డిజిటల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ను  5 సెప్టెంబర్ 2017 న  భారత ఉపరాష్ట్రపతి  ప్రారంభించారు.  ఈ  పోర్టల్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులే గాక  తల్లిదండ్రులు కూడా విద్యా సమాచారాన్ని పొందవచ్చు. విద్యార్థులు ఉపాధ్యాయులు సులభంగా సమాచారం  పొందడం కోసం దీక్షా పోర్టల్లో  క్యూఆర్​ కోడ్ ఉంది. దీనిలో  ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం నేషనల్ డిజిటల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ వారి ఎన్ సీఈఆర్​టీ పుస్తకాలలో అందించిన క్యూఆర్​ కోడ్‌‌ను స్కాన్ చేసిన తర్వాత  విద్యార్థులకు కావాల్సిన కోర్సుల సమాచారం18 భాషల్లో అందుబాటులో ఉంటుంది. పోర్టల్‌‌ లో క్లాస్ బేస్డ్ స్టడీ మెటీరియల్‌‌ను 1 నుంచి 12వ తరగతి వరకు పొందవచ్చు. దీంతోపాటు  నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్ కోర్సుల వివరాలు, ఈ -–కంటెంట్  కూడా పొందవచ్చు. విద్యార్థులు, ఉపాధ్యాయులు  అన్ని కోర్సుల మాడ్యూళ్లను టెక్స్ట్, వీడియోలు ఉచితంగా పొందవచ్చు.  

స్వయం ప్రభ 

కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రభ యాప్​ను అభివృద్ధి చేసింది. 1 నుంచి10వ తరగతి వరకు, స్వయం ప్రభ  డీటీహెచ్ ​చానెళ్లలో ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి11 గంటల వరకు రెండు గంటల టెలికాస్ట్ అవుతుంది. షెడ్యూల్ ఒక్కొక్కటి రెండు గంటల  పాటు తరగతి  పునరావృత  క్లాసులు కూడా  టెలికాస్ట్ అవుతాయి. 11, 12 తరగతులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రోజంతా పునరావృతమవుతాయి.  టెలికాస్ట్‌‌తో మూడు గంటల టెలికాస్ట్ షెడ్యూల్ ఉపయోగించుకోవచ్చు.  వారం రోజుల  ప్రసార షెడ్యూల్స్​ ఎన్​సీఈఆర్టీ వెబ్‌‌సైట్‌‌లో, స్వయం ప్రభ 
వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంటాయి.

వర్చువల్​ తరగతులు

రేడియో, యూట్యూబ్, టీవీల్లో దేశవ్యాప్తంగా వర్చువల్ తరగతులు, విద్యా విషయాలు ప్రసారం అవుతున్నాయి. దూరదర్శన్, ఆలిండియా రేడియో లెర్నింగ్‌‌లో ప్రాథమిక, మధ్య, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల ఆధారిత తరగతులు. పదవ తరగతి, ప్లస్ టు  బోర్డులకు హాజరయ్యే విద్యార్థుల కోసం మోడల్ ప్రశ్నపత్రాలు, ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ సమాచారం, స్టోరీ టెల్లింగ్,  క్విజ్ షోలు ఉన్నాయి. ఈ విద్యా ప్రసారాలు చాలా వరకు ఉదయాన్నే ప్రారంభమవుతాయి, మధ్యాహ్నం పునరావృతమవుతాయి.

వినికిడి లోపం ఉన్న అభ్యాసకుల కోసం పాఠ్యప్రణాళిక -ఎన్​సీఈఆర్​టీ,  ఎన్​ఐఓఎస్​ కోర్సు కంటెంట్  వెబ్‌‌సైట్‌‌లో,  యూ ట్యూబ్​లో సంకేత భాషలో కూడా రికార్డ్ చేసి అందుబాటులో ఉంది.  పోటీ పరీక్షలైన ఐఐటీ, జేఈఈ, నీట్ ప్రిపరేషన్ కోసం ఐఐటీపీఏఎల్, ఈ అభ్యాస్ పోటీ పరీక్షల కోసం ఉన్నత విద్యా శాఖ ఆన్‌‌లైన్ లెర్నింగ్  కోసం ఏర్పాట్లు చేసింది. భౌతికశాస్త్రం193 వీడియోలు, గణితం 218 వీడియోలు, కెమిస్ట్రీ146 వీడియోలు, జీవశాస్త్రం120 వీడియోలు, ఐఐటీపీఏఎల్​ఉపన్యాసాలు స్వయం ప్రభ ఛానెళ్లలో ప్రసారం అవుతాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీలో దాదాపు 9 కోట్ల డిజిటల్ రిసోర్సెస్ ఉన్నాయి. దీక్ష, ఎన్సీఈఆర్టీ, స్వయం ప్రభ,  స్వయం, రేడియో లెస్సన్స్, వినికిడి లోపం ఉన్నవారికి అందించే సమాచారం, పోటీ పరీక్షలకు అందించే సమాచారం ఇవన్నీ కూడా దేశంలోనే  వివిధ విషయాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తయారు చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఆన్ లైన్​లో పొందుపరుస్తున్నారు. 

 డా. రవి కుమార్ చేగోని, ప్రధాన కార్యదర్శి,    తెలంగాణ గ్రంథాలయ సంఘం