
ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్‌గా మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిలిచారు. ఆయనకు 77% అప్రూవల్ రేటింగ్ దక్కినట్టు మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ సర్వే వెల్లడించింది. మోడీ అప్రూవల్ రేటింగ్ ఈ ఏడాది జనవరిలో 72% ఉంటే.. ఆగస్టు నాటికి 75 శాతానికి చేరింది. ఇప్పుడు అది ఏకంగా 77 శాతానికి పెరిగినట్టుగా సర్వే ప్రకటించింది.