రూ.599 కే  ప్రైమ్ యాన్యువల్ ప్లాన్‌

రూ.599 కే  ప్రైమ్ యాన్యువల్ ప్లాన్‌

హైదరాబాద్, వెలుగు:  అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌‌‌‌ కోసం ఏడాది ప్లాన్‌‌‌‌ను   రూ.599  కే ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌‌‌‌తో సబ్‌‌‌‌స్క్రయిబ్ అయితే కేవలం ఒక్క యూజర్ మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది. కేవలం ఇండియన్ మార్కెట్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌‌‌‌ను తీసుకొచ్చామని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. ఈ యాన్యువల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ కోసం ప్రైమ్ వీడియో యాప్ లేదా వెబ్‌‌‌‌సైట్ ద్వారా సబ్‌‌‌‌స్క్రయిబ్ అవ్వొచ్చు. యూజర్లు  అమెజాన్ ఒరిజినల్స్‌‌‌‌, ఇండియా–న్యూజిల్యాండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో సహా లైవ్ క్రికెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు, మరిన్నీ  వీడియో కంటెంట్‌‌‌‌ను చూడొచ్చని  కంపెనీ పేర్కొంది. ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో డౌన్‌‌‌‌లోడ్ చేసుకునే ఫీచర్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ ప్లాన్‌‌‌‌తో అందుబాటులో ఉంటుంది. ‘ప్రైమ్‌‌‌‌ వీడియో గత ఆరేళ్ల నుంచి మంచి గ్రోత్‌‌‌‌ను నమోదు చేస్తోంది. దేశంలోని 99%  పిన్‌‌‌‌కోడ్ ఏరియాల్లోని వ్యూయర్లు తమ యాప్‌‌‌‌లో కంటెంట్‌‌‌‌ను చూస్తున్నారు’ అని ప్రైమ్‌‌‌‌ ఇండియా  వీపీ  గౌరవ్‌‌‌‌ గాంధీ అన్నారు.