సెహ్వాగ్‌లా ఆడే సత్తా పృథ్వీ సొంతం

సెహ్వాగ్‌లా ఆడే సత్తా పృథ్వీ సొంతం

న్యూఢిల్లీ: ఐపీఎల్ లో అదరగొట్టిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు సెలెక్టర్లు షాకిచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ టెస్ట్ సీరీస్ తోపాటు తదుపరి జరగబోయే ఇంగ్లండ్ సిరీస్ కూ  అతడికి ఎంపిక చేయలేదు. ఈ విషయంపై మాజీ సెలక్టర్ శరణ్ దీప్ సింగ్ స్పందించాడు. ఈ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందన్న శరణ్ దీప్.. పృథ్వీ షాను మరో వీరేంద్ర సెహ్వాగ్ గా పోల్చాడు. 

'భారత జట్టులో సెహ్వాగ్ ఎలాంటి పాత్ర పోషించాడో అలాంటి పాత్ర పోషించే సత్తా పృథ్వీకి ఉంది. ఇంత త్వరగా అతడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత అతడ్ని పక్కనబెట్టారు. అప్పటినుంచి పృథ్వీ రంజీల్లో అద్భుతంగా రాణించి, పరుగులు చేశాడు. తన టెక్నిక్ ను సరి చేసుకొని ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. కాబట్టి అతడ్ని బ్యాకప్ గా ఉంచుకోవాలి' అని శరణ్ దీప్ సూచించాడు.

మరిన్ని వార్తలు