అడ్డగోలుగా రైడ్ చార్జీలు వేస్తున్న ప్రైవేట్ ​కంపెనీలు

అడ్డగోలుగా రైడ్ చార్జీలు వేస్తున్న ప్రైవేట్ ​కంపెనీలు
  • ప్యాసింజర్ల నుంచి పైసా వసూల్ 
  • అడ్డగోలుగా రైడ్ చార్జీలు వేస్తున్న ప్రైవేట్ ​కంపెనీలు
  • ఒక్కో టైంలో ఒక్కో రేటు
  • అదనంగా క్యాన్సిలేషన్​ఫీజు, వెయిటింగ్​చార్జీలు
  • హై డిమాండ్​ ఏరియాలంటూ జనం జేబులకు చిల్లు

దిల్​సుఖ్​నగర్​లో ఉండే రాణి బంజారాహిల్స్​లో జాబ్ చేస్తుంది. తరచూ ఆన్​లైన్​ ద్వారా బైక్​ లేదా ఆటో బుక్​చేసుకుంటుంది.  చాలాసార్లు డ్రైవర్లు ముందుగానే డెస్టినేషన్​ అడిగి, పికప్​ కు వచ్చేవాళ్లు కాదు. బుకింగ్​ క్యాన్సిల్​చేయాలని అడిగేవారు. ఇలా చాలాసార్లు క్యాన్సిల్​ చేసేదాకా వేరే  రైడ్​బుకింగ్​కు అవకాశం లేకపోవడంతో రాణి ఆ రైడ్​ను క్యాన్సిల్​చేసి వేరే రైడ్​లో పెనాల్టీ  చెల్లించిం ది. రోజూ ఒకే  రూట్​లో వెళ్తున్నా ఒక్కో రోజు ఒక్కో రేటు పే చేస్తున్నట్లు తెలిపింది. అమీర్​పేటలో ఉండే రాజేందర్ శంషా బాద్ ఎయిర్​పోర్టుకు వెళ్లాల్సి వచ్చి ఉదయం 8 గంటలకు ఓ యాప్ నుంచి క్యాబ్ బుక్​ చేసుకుందాం అనుకు న్నాడు. చార్జీ రూ.900 చూసి బిత్తరపో యాడు. దూరం 20 కిలోమీటర్లే కానీ, అర్జెంట్​గా వెళ్లాల్సి ఉండి చివరకు రైడ్ బుక్​ చేసుకుని వెళ్లాడు.

హైదరాబాద్, వెలుగు: ఆన్​లైన్ ద్వారా బుక్​చేసుకునే ట్యాక్సీలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న సదరు రైడింగ్​కంపెనీలు కస్టమర్ల నుంచి అందినకాడికి గుంజుతున్నాయి. ప్యాసింజర్​వైపు నుంచి ఎలాంటి తప్పూ లేకపోయినా టెక్నికల్​గా రైడర్ తప్పుగా చూపించి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం సిటీ జనం క్యాబ్​లతోపాటు ఆటో, బైక్​ట్యాక్సీలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడం, నిర్ణీత రేట్లు లేకపోవడం ప్రైవేట్​కంపెనీలకు వరంగా మారింది. ఈ మధ్యకాలంలో పెరిగిన ధరల కారణంగా తక్కువ కిలోమీటర్లు ఉన్న రైడ్లను రైడర్లు పెద్దగా యాక్సెప్ట్​చేయట్లేదు. ఈ నేపథ్యంలో క్యాన్సిలేషన్ చార్జీలు కస్టమర్లకు తలనొప్పిగా మారాయి. తమ తప్పులేకున్నా పెనాల్టీ కడుతున్నామని వాపోతున్నారు. రోజూ ఆఫీసులు, ఇతర పనులకు ఆటో, బైక్, క్యాబ్​లు బుక్ చేసుకుంటున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తప్పనిసరి పరిస్థితిలో..

ప్రస్తుతం ప్రైవేట్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ లు ప్యాసింజర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. బైక్, ఆటో, కారు ఇలా ఏది బుక్ చేసుకున్నా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైడ్ బుక్ చేసుకున్న తర్వాత డ్రైవర్ ఎంత దూరంలో ఉన్నాడో ప్యాసింజర్​చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే చెప్పిన టైంలో రైడర్​రాకపోతే కస్టమర్ అతనికి కాల్, మెసేజ్ చేసి అప్‌‌‌‌డేట్ తెలుసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ కొంతమంది డ్రైవర్లు బుకింగ్ ని ఆక్సెప్ట్ చేసి .. టైం గడుస్తున్నా వస్తలేరు. చివరికి ఎక్కడున్నావని కాల్​చేస్తే బుకింగ్ క్యాన్సిల్ అయినా చేయాలని చెబుతున్నారు. తాము చేస్తే క్యాన్సిలేషన్, పెనాల్టీ పడుతుందని, రైడ్ బుక్ చేసుకున్నవాల్లే చేయాలని తేల్చి చెబుతున్నారు. చేసేదేం లేక చాలా మంది బుకింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో  క్యాన్సిలేషన్ చార్జ్ 15 రూపాయలు పడుతోంది. వెంటనే ఇంకో రైడ్ బుక్ చేసుకోవాలంటే చార్జీతోపాటు క్యాన్సిలేషన్​ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఇలా కస్టమర్లు తమ మిస్టేక్ లేకుండా ఎక్స్‌‌‌‌ట్రా పే చేస్తున్నారు.

ఇష్టమొచ్చినట్లుగా..

జనాల అవసరాలను వీలైనన్ని మార్గాల్లో క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కిలోమీటర్ల గోల్ మాల్, రైడ్ మధ్యలో రేట్లు పెంచేయడం, క్యాన్సిలేషన్స్ చార్జీలు ఇష్టమొచ్చినట్లు వేయడం చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించేందుకు ఏ కంపెనీకి సరైన కస్టమర్ కేర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లను సాకును చూపించి కస్టమర్ల నుంచి డబుల్, త్రిబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ట్రాఫిక్, పీక్ అవర్స్​లో రైడ్ల మధ్యలోనే వెయిటింగ్ అంటూ చార్జీలు పెంచేస్తున్నాయి. రైడ్ బుక్ చేసేముందు ఒక చార్జీ, ట్రిప్ ఎండ్ అయిన తర్వాత ఒక చార్జీ అమౌంట్ మెన్షన్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనేకమంది ప్రైవేట్ ట్రాన్స్ పోర్టేషన్ పట్ల తీవ్రమైన అసహనంతో ఉన్నారు. అడ్డగోలుగా పైసలు వసూలు చేస్తున్నారని కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీలు తీరు మార్చుకోవాలి

అందుబాటులో ఉన్నాయని ట్రాన్స్‌‌‌‌ పోర్ట్ యాప్‌‌‌‌లు ఎక్కువగా వాడుతుంటే కంపెనీలు దాన్ని మిస్ యూజ్ చేస్తున్నాయి. ఇంతకు ముందు ఆఫీసుకు వెళ్లేందుకు రూ.40 అయ్యేది. ఇప్పుడు రూ.60 నుంచి రూ.90 అవుతోంది. రోజూ ఒకే టైంకు రైడ్​బుక్​చేస్తున్నా చార్జీల్లో చాలా తేడా ఉంటోంది. ఒకవేళ్ల రైడర్ రావడానికి లేట్ అయ్యి క్యాన్సిల్ చేస్తే తర్వాతి రైడ్​కు రూ.15 రూపాయలు అదనంగా పే చేయాల్సి వస్తోంది. చాలామంది ఈ సమస్య గురించి రివ్యూల్లో రాస్తున్నారు. అవి చూసైనా కంపెనీలు తీరు మార్చుకోవాలి.

- వాణి, ప్రైవేట్ ఎంప్లాయ్, కూకట్​పల్లి

మునుపటితో పోలిస్తే చార్జీలు పెరిగాయి

నేను ఎప్పటి నుంచో ఆన్​లైన్ ​రైడ్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ వాడుతున్నాను. కాన్ని కొన్ని నెలల నుంచి విపరీతంగా ఇబ్బంది అవుతోంది. మును పటితో పోలిస్తే చార్జీలు పెంచారు. అదీ కాక ముందే డెస్టినేషన్​ తెలుసుకొని, తమకు గిట్టు బాటు కావడం లేదని రైడ్​క్యాన్సిల్ చేయమం టూ రైడర్లు ఆర్గ్యూ చేస్తున్నారు. క్యాన్సిలేషన్ చార్జీలు పడుతున్నాయి. అత్యవసర సమయంలో తప్పక ఎక్కాల్సి వస్తోంది. 

-మమత, ప్రైవేట్ ఎంప్లాయ్, మాదాపూర్