మరో క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్..పొలిమేర 2 బాటలోనే

మరో క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్..పొలిమేర 2 బాటలోనే

మొదట్లో హీరోయిన్లుగా వెలిగిన చాలామంది అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. ప్రియమణి(Priyamani) కూడా అదే చేసింది. అయితే మిగతా వారిలా కాకుండా జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో తన టాలెంట్‌‌ని గతంలో కంటే ఎక్కువగా ప్రూవ్ చేసుకునే చాన్స్ దొరుకుతోంది ప్రియమణికి. నారప్ప, భామాకలాపం, విరాటపర్వం, మొన్నటికి మొన్న వచ్చిన జవాన్ లోని పాత్రలే అందుకు ఉదాహరణ. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రియమణి తన హిట్ సినిమాకు సీక్వెల్లో నటిస్తోంది. గత రెండేళ్ల నుంచి ఓటీటీలో బాగా ఎదురు చూస్తున్న చిత్రం పొలిమేర. ఇప్పుడు పొలిమేర 2 థియేటర్లో రిలీజై పాజిటివ్ టాక్తో ఆడియాన్స్లో మరోసారి ఇంట్రస్ట్ పెంచింది.

దీంతో ప్రియమణి ఖాతాలో హిట్ మూవీగా నిలిచిన భామాకలాపం (Bhamakalapam) మూవీని పొలిమేర బాటలోనే తీసుకెళ్లడానికి అయ్యారు మేకర్స్. భామాకలాపం సీక్వెల్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ అభిమన్యు భామాకలాపం 2 ను మరింత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
 
లేటెస్ట్గా రిలీజ్ చేసిన భామాకలాపం 2(Bhamakalapam2) పోస్టర్లో ప్రియమణి వెనక గన్నులు, వాక్యూమ్ క్లీనర్తో కనిపించింది. అలాగే ఆమె పక్కన రక్తం మరకలతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉండడం, ప్రియమణి చుట్టూ గన్స్ ఫైర్ అవుతున్నట్లుగా..వాటి వెనుక పెద్ద బిల్డింగ్ ఉన్నట్లు పోస్టర్ ఫస్ట్లుక్ పోస్టర్ మరింత ఆసక్తిని పెంచింది. 'ది మోస్ట్ డేంజరస్ వుమన్' థియేటర్స్ లో రాబోతుందంటూ మేకర్స్ తెలియజేశారు. 'ఆహా'(Aha) స్టూడియోస్ సమర్పణలో డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీలో మొదటి పార్ట్ రిలీజై పార్ట్ 2 ని థియేట్రికల్ రిలీజ్ చేయడం మంచి విషయమే అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)