షాద్ నగర్ హత్యకేసు: రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి

షాద్ నగర్  హత్యకేసు: రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి

ఓ ఆడబిడ్డ రాక్షసత్వం చూపారు. వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్యకేసు రిమాండ్ రిపోర్ట్ చూస్తే ..నిందితుల్ని ఏం చేసినా పాపం లేదన్న కసిపుడుతోంది. హెల్ప్..హెల్ప్ అంటూ అభాగ్యురాలు ప్రాథేయపడినా ..కిరాతకులు కనికరించలేదు.

వెటర్నరీ డాక్టర్ హత్య కేసు విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. అఘాయిత్యం చేసే సమయంలో దుర్మార్గులు అత్యంత కిరాతకంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.  హెల్ప్… హెల్ప్… హెల్ప్ అని బాధితురాలు చేసిన ఆర్తనాదాలు ఆ ఉన్మాదుల చెవికెక్కలేదు. తాగిన మైకంలో కన్నుమిన్ను కానకుండా యువతి నోట్లో మద్యం పోశారు. ఆ తర్వాత ఒకరి వెంట ఒకరు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

MORE NEWS:

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

వెటర్నరీ డాక్టర్ ఘటనపై మహేశ్ పోస్ట్..సోషల్ మీడియాలో వైరల్

రాత్రి 9.30 నుంచి 10.20 వరకు 45 నిమిషాల పాటు ఉన్మాదులు దారుణ కాండ కొనసాగించారు. బాధితురాలి ముక్కు, నోరు మూయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది  . బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్ లోకి ఎక్కించారు దుండగులు. ఈ సమయంలోనే బాధితురాలు చనిపోయిందని చెప్తున్నారు పోలీసులు. లారీలోకి ఎక్కించిన తరువాత కూడా పశువుల్లా ప్రవర్తించారు ఉన్మాదులు. లారీలో కూడా ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తరువాత ఓ నిందితుడు మళ్లీ కిందకు వెళ్లి ప్యాంట్ తీసుకొచ్చాడు. షాద్ నగర్ బ్రిడ్జ్ కింద బాధితురాలిని దింపే సమయంలో ఆమె బతికే ఉంటుందన్న అనుమానంతో  దుండగులు కాల్చి చంపినట్టు సమాచారం. లారీ క్యాబిన్లో రక్తపు మరకలు, వెంట్రుకలను సేకరించింది ఫోరెన్సిక్ నిపుణుల టీమ్.

దర్యాప్తులో వెటర్నరీ డాక్టర్  ఫోన్ కాల్స్ ఆధారంగానే నిందితుల ఆచూకీని తెలుసుకున్నారు పోలీసులు. తొండుపల్లి గేటు దగ్గర నిందితుడు పంక్చర్ వేయించేందుకు బండి తీసుకెళ్లిన సమయంలో…  15  నిమిషాలు ఆలస్యం కావడంతో  బాధితురాలు తన మొబైల్  నుంచి మహ్మద్ కి ఫోన్ కాల్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఈ క్లూ ఆధారంగా మహమ్మద్ ఆచూకీ కనుకున్నారు పోలీసులు.