
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా, పట్టణ, మండల కేంద్రాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఆయన ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పలువురు వక్తలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్