డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన లేటెస్ట్ తమిళ మూవీ ‘స్టీఫెన్’ (Stephen). ఈ మూవీ థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చి ఆడియన్స్కి థ్రిల్ ఇస్తుంది. శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇందులో గోమతి శంకర్, మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, విజయశ్రీ కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ రాయన్ సంగీతం అందించారు. వెంకట్ పాండియన్ నిర్మించారు. గోకుల్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు.
9 మంది యువతులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ కథే ఈ ‘స్టీఫెన్’. డైరెక్టర్ మిథున్ బాలాజీ ఈ సినిమాని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. అయితే, న్యూస్ చదువుతున్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు చేసే సీరియల్ కిల్లర్ కథను ఎంగే జింగ్ వేలో చెప్పుకొచ్చాడు. ఒక్కో మర్డర్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుంటే, కథనం మరింత ఆసక్తి రేపుతోంది. ఇక చివరి 20 నిమిషాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
సైకో కిల్లర్స్ అంటే ఎక్కడో ఉండరు. మన చుట్టుపక్కనే చాలా కోణాల్లో కనిపిస్తూ ఉంటారు. అలా 9 మంది అమ్మాయిలను హత్య చేసిన కిల్లర్ ఎవరు? ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది? ఎవరితో కలిసి చేశాడు? అనేది ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. పూర్తి కథగా చెప్పాలంటే..
Step inside Stephen’s mind, ungalukku dhairiyam irundha mattum 🔪😶 pic.twitter.com/C97LIb7rkA
— Netflix India South (@Netflix_INSouth) December 5, 2025
కథేంటంటే:
సినిమా చాన్స్‌ల పేరుతో 9 మంది అమ్మాయిలను ఒక వ్యక్తి హత్య చేస్తాడు. అతని గురించి పోలీసులు వెతుకుతుంటారు. అదే టైంలో స్టీఫెన్ (గోమతి శంకర్) పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనే ఆ 9 హత్యలు చేశానని చెప్పి లొంగిపోతాడు. డెడ్ బాడీలను అడవిలో పడేశానని చెప్తాడు. పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరుస్తారు. కానీ.. అమ్మాయిల శవాలు దొరక్కపోవడంతో అందరిలో అతను నిజం చెప్తున్నాడా? లేక అబద్ధం చెప్తున్నాడా? అనే అనుమానం ఉంటుంది.
►ALSO READ | అక్కడ నటించడానికి మొదట్లో భయపడ్డా.. వాళ్లు అలా చూసుకోవడంతో మారిపోయా.. సుహాస్ భామ సినీ విశేషాలు
అందుకే కోర్టు అతడిని ఎగ్జామిన్ చేసేందుకు, మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు పోలీసులకు 15 రోజుల టైం ఇస్తుంది. అతని మానసిక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు సీమ (స్మృతి వెంకట్) అనే సైకియాట్రిస్ట్‌ని అపాయింట్ చేస్తారు. ఆమె ఏం తెలుసుకుంది? కేసుని దర్యాప్తు చేస్తున్న మైఖేల్ (మైఖేల్ తంగదురై)కి తెలిసిన నిజం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి.
ఓవరాల్ విశ్లేషణ..
ఇదివరకు చాలా సినిమాల్లో ఓ సైకో కిల్లర్ అమ్మాయిలను చంపడం అనే కథని మనం చాలాసార్లు చూశాం. అయినప్పటికీ.. ఈ మూవీ స్టోరీ కొత్తగా ఉంటుంది. సైకో కిల్లర్ స్టీఫెన్ పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. అదే ఈ మూవీకి మరింత బలాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా వచ్చే ఊహించని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి. సస్పెన్స్, థ్రిల్లర్ ను ఇష్టపడే ఆడియన్స్ కు స్టీఫెన్ మంచి కిక్ ఇస్తుంది.
