Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పుష్ప 2 మూవీ టీజర్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం. ఓ నెటిజన్‌ పుష్ప-2 అప్‌డేట్‌ గురించి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్‌ని ప్రశ్నించగా..వారి ట్వీట్‌కు రెస్పాన్స్ ఇస్తూ పుష్ప టీజర్ అప్‌ డేట్‌ ఇచ్చేశాడు. అదేంటంటే..త్వరలో అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా (ఏప్రిల్ 8న) టీజర్ వస్తుందని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు.

Also Read: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్

పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.

అంతేకాకుండా..సుకుమార్ క్రియేటివ్ ఐడియాస్..అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంచనాల దృష్ట్యా..సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి తగ్గేదేలే అన్నట్టు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. పుష్ప ది రూల్ మూవీ ఆగస్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి(Gangotri) నుండి పుష్ప(Pushpa) వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఇన్స్పిరేషన్. ఒక్కొక్క సినిమాకు ఆయన పడిన కష్టం, ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచాలనే తపన ఆయన్ని స్టైలీష్ స్టార్ ని చేసింది. పుష్ప సినిమాలో ఆయన డైలాగ్స్, మ్యానరిజమ్స్, డాన్స్ కి ప్రపంచం మొత్తం ఫిదా అయిపొయింది.

వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ స్టార్స్ అందరు పుష్ప నామస్మరణే చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆయన వీడియో  వైరల్ అయ్యాయి. అంతలా తన నటనతో అదరగొట్టేశాడు అల్లు అర్జున్. దీంతో అతనికి దుబాయిలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు బొమ్మను కూడా ఏర్పాటు చేశారు.