వీడియో: కారు రేసులో ఘోర ప్రమాదం.. బయటపడ్డ డ్రైవర్లు

వీడియో: కారు రేసులో ఘోర ప్రమాదం.. బయటపడ్డ డ్రైవర్లు

‘వరల్డ్ ర్యాలీ చాంపియన్’పోటీలలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద వీడియో చూస్తే ఆ కారులో ఉన్నవాళ్లు కచ్చితంగా చనిపోయారనే అంతా అనుకుంటారు. కానీ, అంత భయంకర ప్రమాదం జరిగినా ఎటువంటి అపాయం లేకుండా ఆ కారు డ్రైవర్లు బయటపడ్డారు. ఆ ప్రమాద వీడియో అంతా డ్రైవర్లు ధరించిన హెల్మెట్ కెమెరాలో రికార్డయింది.

ప్రపంచ ఛాంపియన్ ఓట్ తనక్ మరియు అతని కోడ్రైవర్ మార్టిన్ జార్వియోజా శుక్రవారం మోంటే కార్లో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో వారి కారు అదుపుతప్పి గాలిలోకి ఎగిరి.. రోడ్డు పక్కన ఉన్న చిన్న లోయలో పడింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లను వేగంగా గుద్దుకుంటూ చాలా దూరం వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ కారు నుంచి బయటకు రావడం కూడా కెమెరాల్లో రికార్డయింది. ఓట్ తన కొత్త జట్టుకు మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం గురించి ఓట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘ఆ రోజు ఉదయం ఏం జరిగిందో మాకసలు అర్థం కాలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ప్రమాదం అంత భయంకరగా జరిగినా.. మాకు ఏం కాలేదు. నేను, నా కోడ్రైవర్ ఆరోగ్యంగానే ఉన్నాం. త్వరలోనే మేం కోలుకుంటాం’ అని ఓట్ తనక్ తన ట్విట్టర్ పేజీలో పేర్కొంటూ ప్రమాద ఫుటేజీని ట్యాగ్ చేశాడు. ఆ వీడియో ఓట్ తన ట్విట్టర్ ఖాతాలో శనివారం షేర్ చేశాడు. అప్పటినుంచి 4.7 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

ఓట్ తనక్ మరియు మార్టిన్ జార్వియోజా ప్రమాదం తర్వాత బాగానే ఉన్నారని.. ముందుజాగ్రత్త కోసం వైద్య పరీక్షలు నిర్వహించామని అతని టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదం జరగకపోతే ఓట్ ఈ ర్యాలీని గెలిచేవాడా అంటే అది కూడా వీలులేదు. ఎందుకంటే ఈ ప్రమాద సమయంలో ఓట్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. అటు కప్పూ పోయి.. ఇటు ప్రమాదానికి గురైన వీరి పరిస్థితి రెంటికి చెడ్డ వాళ్లలాగా మారింది.

For More News..

జనవరి 26 సందర్భంగా తెలంగాణ యువకుడి ఘనత

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

మంత్రి బైకెక్కిన హీరోయిన్