
వేములవాడ, వెలుగు: సంక్రాంతి సందర్భంగా మిడ్ మానేరు నీటిలో శనివారం తెప్పల పోటీలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఓల్డ్ గ్రామంలోని బ్యాక్ వాటర్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. సీనియర్ విభాగంలో 20 మంది, జూనియర్ విభాగంలో 20 మంది పాల్గొన్నారు. కిలో మీటర్ మేర తెప్పలపై వెళ్లి ముందుగా జాతీయ జెండా తీసుకువచ్చిన ముగ్గురికి బహుమతులు అందజేశారు. సీనియర్ విభాగంలో ఫస్ట్బొమ్మ మహేశ్, సెకండ్ తునికి స్వామి, థర్డ్ తునికి బాలరాజు, జూనియర్ విభాగంలో ఫస్ట్ తునికి రఘు, సెకండ్ రాము, థర్డ్పండుగ వంశీ నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు పోగుల లక్ష్మన్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య, సంఘం అధ్యక్షుడు తునికి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.