నాపై అనర్హత వేటును ఊహించలే: రాహుల్ గాంధీ

నాపై అనర్హత వేటును ఊహించలే: రాహుల్ గాంధీ
  • అమెరికా టూర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

స్టాన్ ఫర్డ్ (కాలిఫోర్నియా): ఎంపీగా తనపై అనర్హత వేటు పడుతుందని అస్సలు ఊహించలేదని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం అమెరికా కాలిఫోర్నియా స్టేట్ లో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్లతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో ఇలాంటివి సాధ్యమని అనుకోలేదు. కానీ రాజకీయాలు అంటేనే ఇలా ఉంటాయి. ఏదేమైనా నాపై అనర్హత వేటు ప్రజాసేవకు గొప్ప అవకాశంగా భావిస్తున్నా” అని రాహుల్ అన్నారు.

రానున్న రోజుల్లో ఇండియా, చైనా మధ్య సంబంధాలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ఎంట్రపెన్యూర్స్ తోనూ రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సేఫ్టీ, సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు. డేటా సేఫ్టీ, సెక్యూరిటీ కోసం సరైన నిబంధనలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. పెగాసస్ వంటి స్పైవేర్ లకు తాను భయపడనని రాహుల్ అన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నదన్న విషయం కూడా తనకు తెలుసన్నారు. ఈ సందర్భంగా తన ఐఫోన్ తీసి.. ‘హలో మిస్టర్ మోడీ’ అంటూ సరదాగా జోక్ చేశారు.