గద్దర్ గురించి రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

గద్దర్ గురించి రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar  ) ఇకలేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి క్షిణించి ఆరోగ్యం విషమిండంతో ఆయన మృతిచెందారు. గద్దర్(Gaddar  ) మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. గద్దర్(Gaddar  ) మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi)   తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ (Gaddar  )ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక పోతున్నామన్నారు. ఇటీవల జరిగిన ఖమ్మం జనగర్జన సభలో గద్దర్  తనతో  ఎంతో ఆప్యాయంగా ఉన్నారని రాహుల్ గాంధీ ( Rahul Gandhi) గుర్తు చేసుకున్నారు. గాంధీ కుటుంబం పట్ల అపార అభిమానులు ఉన్న వ్యక్తి గద్దర్ అని చెప్పారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు.. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఎంతో ఉతేజపరిచిన వ్యక్తి గద్దర్(Gaddar  )  అని  రాహుల్ గాంధీ (Rahul Gandhi)అన్నారు. కాగా, గద్దర్ (Gaddar  ) మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో ముఖ్య కూడళ్లలో గద్దర్ (Gaddar  )చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

 కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో.. గద్దర్ (Gaddar  )కు విడదీయరాని బంధం ఉంది.  ఆ మధ్య ఖమ్మంలో జరిగిన సభలోవేదిక మీదే రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి ..గద్దర్‌(Gaddar  )ను పరిచయం చేశారు రేవంత్‌. జీవితంతో దాదాపు అన్నీ చూసేసిన గద్దర్(Gaddar  ).. రాహుల్‌ను చూసి తన్మయత్వానికి గురయి  ఆలింగనం చేసుకొని.. నుదుటి మీద ముద్దులు పెట్టారు. చెవిలో ఏదో గుసగుస కూడా చెప్పారు రెండు నిమిషాలు.

అంతే కాకుండా (Gaddar  ) గద్దర్ ను చూసి రాహుల్ గాంధీ  (Rahul Gandhi) సైగలు చేస్తూ పక్కనే కూర్చోమన్నారు. నిజానికి రాహుల్‌ గాంధీని గద్దర్ ఇలాగే హగ్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలానే చేశారు. తన పాటతో సమాజాన్ని కదిలించి.. పేద జనాల గొంతుకుగా మారిన గద్దర్ మరణాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.