అక్టోబర్, నవంబర్ లో భారత్‌తో యుద్ధం.. పాక్ మంత్రి సంచలనం

అక్టోబర్, నవంబర్ లో భారత్‌తో యుద్ధం.. పాక్ మంత్రి సంచలనం

ఇండియా – పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగబోతోందంటూ పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేసినట్టు పాకిస్థాన్ మీడియా ప్రకటించింది. ఇండియా – పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగబోతుందని షేక్ రషీద్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. వచ్చే అక్టోబర్ లో గానీ.. ఆ తర్వాత నెలలో గానీ… పాకిస్థాన్- భారత్ రెండు దేశాల మధ్య ఫుల్ బ్లో వార్ జరగవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.

కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తర్వాత పాకిస్థాన్ దూకుడైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇండియాతో రోడ్డు రవాణా, రైలు రవాణా, విమాన రవాణా సేవలన్నీ బంద్ చేసింది. దౌత్యపరంగానూ తెగతెంపులు చేసుకుంది. తాజాగా భారత్ వైపు గగన తలంపై విమానాల రాకపోకలు నిలిపివేసింది. క్షిపణి పరీక్షలు చేస్తోంది. ఎల్ఓసీ పొడవునా స్పెషల్ గార్డ్, టెర్రర్ బృందాలను మోహరించింది. ఈ పరిణామాల తర్వాత.. ఆ దేశ రైల్వే శాఖ మంత్రి వ్యాఖ్యలపైనా భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది.