ఆంధ్రప్రదేశ్‌లో రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 4 నాటికి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో మార్చి 3 నుంచి తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 4న రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 4 నుంచి 6 వరకు వానలు పడతాయని చెబుతున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం వచ్చే ఐదు రోజుల పాటూ వాతావరణం వేడిగానే ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి:
