రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన రీసెంట్ ఫిల్మ్ ‘పాంచ్ మినార్’ (Paanch Minar). రామ్ కడుముల దర్శకత్వంలో మాధవి, ఎంఎస్‌ఎమ్ రెడ్డి నిర్మించిన చిత్రం లాస్ట్ వీక్ (నవంబర్ 21న) థియేటర్లోకి వచ్చింది. క్రైమ్ కామెడీ స్టోరీతో వచ్చిన ఈ మూవీ.. వారంలోపే ఓటీటీకి ఎంట్రీ ఇచ్చింది.
అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా OTTకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పాంచ్ మినార్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది రాజ్ తరుణ్ ఘోర పరాజయానికి నిదర్శనం అని చెప్పుకోవాలి.
ఇంకో విషయం చెప్పాలంటే.. ‘పాంచ్ మినార్’ అనే పేరుతో ఓ సినిమా కూడా ఉందా? అనే సందేహం సినీ ఆడియన్స్లో ఉంది. అటువంటి పాంచ్ మినార్ అటూ థియేటర్లో ఆడక.. ఇటూ ఓటీటీలో ఆడక.. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేసింది. దానికితోడు సడెన్గా వారం రోజుల్లోనే ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొత్తగా చెప్పేదేముంది.. వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న రాజ్‌తరుణ్కి ఇది మరో డిజాస్టర్.
ALSO READ : పవన్‌తో ప్యాచ్ అప్ తప్ప..
సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుని ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది మెయిన్ స్టోరీ లైన్. సినిమా చూస్తున్నంత సేపు నవ్వించేలా ఉన్నప్పటికీ.. రొటీన్ కథ, అండ్ కామెడీకి దూరంగా ఆడియన్స్ ఉన్నారు. సో.. ఎక్కువ రోజులు ఆడక.. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది.
పాంచ్ మినార్ కథగా..
కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ, ప్రయత్నం ఫలించదు. కిట్టు గర్ల్‌ఫ్రెండ్ (రాశీ సింగ్). ఎలా అయినా కిట్టు ఉద్యోగంలో చేరితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తుంటుంది. అంతేకాకుండా కిట్టుకి జాబ్ రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయిన జాబ్ రాదు.
ఇక చేసేదేం లేక ఈజీగా మనీ సంపాదించాలని కిట్టు డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలోనే కిట్టు ఒక స్కామ్‌లో మోసపోతాడు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు తన ఫ్రెండ్ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా చేరతాడు. ఓ రోజు కిట్టు క్యాబ్ ఎక్కిన ఇద్దరు హంతకులు అతడి ముందే ఒక మర్డర్ చేస్తారు.
అప్పుడు అక్కడ చెవిటివాడిగా నటించిన కిట్టు ఏం చేశాడు? అసలు కిట్టు చిక్కుకున్న స్కామ్ ఏంటి? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? ఆ తర్వాత కిట్ లైఫ్ ఎలాంటి మలుపు తీసుకుందనేది మిగతా కథ.
