రాజీనామా చేసి.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను మీ కాళ్ల దగ్గరికి తీసుకొచ్చాం

రాజీనామా చేసి.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను మీ కాళ్ల దగ్గరికి తీసుకొచ్చాం

రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చారని ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మీ అన్నారు. ఇటీవల బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బరిలో దిగుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలం బొడంగి పర్తి, తాస్కన్ గూడెం, ఉడుతల పల్లి గ్రామాలల్లో గడప గడప ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి తరుపున ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  నారాయణపురం నుండి ప్రచారం మొదలు పెట్టానని.. అందరు మంచి ఆదరణతో ఆశీర్వదింస్తున్నారని అన్నారు.  మహిళలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని చప్పారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారని.. పెన్షన్స్, రేషన్ కార్డులు, ఉద్యోగాలు రాక విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ మునుగోడు ప్రజల మీద ప్రేమతో అభివృద్ధికి చేయలేదని... రాజగోపాల్ రెడ్డి రాజీనామా భయంతో నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు పంపించారని తెలిపారు. 

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి.. కేసిఆర్, మంత్రులు, వంద మంది ఎమ్మెల్యేలు మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చారన్నారు. ప్రజల్లో ఆరు గ్యారంటీల మీద మంచి విశ్వాసం ఉందని ఆమె చెప్పారు. ఈసారి తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి  రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.  రాజగోపాల్ రెడ్డి ప్రజల మనిషి అని.. ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటేసి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోమటిరెడ్డి లక్ష్మీ కోరారు.

ALSO READ : హామీలను మరిచిన నాయకులను నిలదీయండి : దినేశ్ కులాచారి​