సిరిసిల్లలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన కౌన్సిలర్

సిరిసిల్లలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన కౌన్సిలర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ  రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన ఆమె అవమానాలు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ సమయం నుంచి పార్టీలో చేరి పనిచేస్తున్నానని.. ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ జేఏసీలో చేరి పోరాటం కొనసాగించానని చెప్పారు. కేటీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరిన తాను పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని గుర్తు చేశారు.

పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనకు పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదని వాపోయారు. ‘‘నన్ను కేటీఆర్ ను కలిసే అవకాశమేఇవ్వలేదు.. మా అమ్మ చనిపోయినా పరామర్శించడానికి కేటీఆర్ రాకుండా చేశారు.. అలాగే నా అన్న చనిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి.. చివరకు మా  అత్త చనిపోయినా..  నా వద్దకు కేటీఆర్ రాకుండా అడ్డుకున్నారు.. అంతేకాదు  నాకు క్యాన్సర్ సోకి రెండేళ్లు  ఆస్పత్రి చుట్టూ చికిత్స చేసుకుంటున్నప్పుడు కూడా కేటీఆర్ నా వద్దకు వచ్చి పరామర్శించకుండా అడ్డుపడ్డారు. అయితే కేటీఆర్ సహకరించడంతో చికిత్స చేయించుకున్నానని.. అదే కృతజ్ఘతతో పార్టీ కోసం అందరికంటే ఎక్కువ కష్టపడ్డా.. అవన్నీ కేటీఆర్  దృష్టికి వెళ్లాయో లేదో తెలియదు..’ అని అన్నారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో నా తమ్ముడు పోటీకి దిగితే మానుకోమని మా సోదరుడికి చెప్పి.. పార్టీ అభ్యర్థి అయిన లక్ష్మినారాయణ గెలుపు కోసం పనిచేశానని చెప్పారు. 

పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తాను ప్రతిసారి పార్టీ కోసం సరే అని సర్డుకున్న కొద్దీ అవమానాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. నా కుటుంబ సభ్యులు చని పోయినా కూడా మంత్రి కేటీఆర్ పరామర్శిండానికి రాకుండా అడ్డుపడడమే కాదు.. తాను ఎన్నో సార్లు కేటీఆర్ కలవాలి అని ప్రయత్నించినా పార్టీ నాయకులు ఏనాడూ తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ వాళ్లే నన్ను అనుమానిస్తుండడమే కాదు ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేస్నున్నానో అని నిఘా పెట్టి వేధించారని.. పార్టీ కోసం ఎంతో కష్టపడినప్పటికీ..కొందరి తీరుతో పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. కౌన్సిలర్ పత్తిపాక పద్మ  వీడియో సందేశం విడుదల చేశారు.