భార్యను గర్భవతి చేసేందుకు ఖైదీకి 15 రోజుల పెరోల్

భార్యను గర్భవతి చేసేందుకు ఖైదీకి 15 రోజుల పెరోల్

జైపూర్‌: భార్యను గర్భవతి చేసేందుకు ఓ ఖైదీకి న్యాయస్థానం15 రోజులు పెరోల్‌ మంజూరు చేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని, దాన్ని కాదనలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజస్థాన్‌కు చెందిన 36 ఏండ్ల నందలాల్‌ ఓ కేసులో దోషిగా తేలడంతో భిల్వారా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో అతను అజ్మీర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా అతని భార్య రేఖ తనకు సంతానం కలిగించేందుకు భర్తను విడుదల చేయాలంటూ జోధ్పూర్ హైకోర్ట్ బెంచ్ను ఆశ్రయించింది. ఆమె పిటీషన్ పై జస్టిస్ సందీప్ మెహతా, ఫర్జాంద్ అలీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. భర్త జైలు శిక్ష కారణంగా అతని భార్య సంతానం పొందే హక్కు కోల్పోయిందని, ఎలాంటి నేరం చేయని ఆమె హక్కులను హరిచడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. 
మహిళ సంతానం పొందే హక్కుకు సంబంధించి బుగ్వేదంతో పాటు పలు హిందూ గ్రంధాలను హైకోర్టు ఉదహరించింది. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం సిద్ధాంతాలను ప్రస్తావించింది. 16 కర్మలలో బిడ్డను కడనడం స్త్రీకి మొదటి హక్కు అని చెప్పిన ధర్మాసనం.. దాన్ని నెరవేర్చేందుకు రేఖ భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.