రాజస్థాన్ ఆలౌట్‌.. గుజరాత్‌ టార్గెట్ 119

 రాజస్థాన్ ఆలౌట్‌.. గుజరాత్‌ టార్గెట్ 119

జయపుర్ వేదికగా గుజరాత్‌ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు 118 పరుగులకే ఆలౌట్ అయింది.  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న  రాజస్థాన్‌  .. గుజరాత్‌ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. జోస్ బట్లర్ (8), యశస్వి జైస్వాల్‌ (14), అశ్విన్ (2), రియాన్ పరాగ్ (4), దేవదుత్ పడిక్కల్‌ (12), జురెల్ (9) ఇలా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.  

రాజస్థాన్‌  జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్‌(30) తప్ప మిగతా ఆటగాళ్లు అందరూ తేలిపోయారు. చివర్లో ట్రెంట్ బౌల్ట్‌ (15) కాస్త ఫర్వాలేదనిపించాడు.   రాజస్థాన్‌  వరుసగా వికెట్లు కోల్పోవడంతో 17 .5 ఓవర్లలో రాజస్థాన్‌  118  పరుగులు మాత్రమే చేయగలిగింది.   గుజరాత్‌  బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2.. షమీ, హార్దిక్, లిటిల్ తలో వికెట్ తీశారు. జయపుర స్టేడియంలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.