టీచింగ్ అంటే ప్యాషన్​..పెండ్లి రోజు కూడా క్లాస్​ చెప్పాడు

టీచింగ్ అంటే ప్యాషన్​..పెండ్లి రోజు కూడా క్లాస్​ చెప్పాడు

టీచింగ్ అంటే ప్యాషన్​ ఇతనికి. ఎంతలా అంటే... ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడా ఆ రోజు క్లాస్​ చెప్తాడు. ఒక్కరోజు కూడా క్లాస్ మిస్​ కావొద్దని ఇప్పటివరకు ఒక్క సెలవు తీసుకోలేదు. ఈమధ్య పెండ్లి డ్రెస్ వేసుకొని ఆన్​లైన్ క్లాస్​లు చెప్పి సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాడు. పేరు ప్రియె కుమార్ గౌరవ్. రాజస్తాన్​లోని అల్వార్​కు చెందిన ఇతను కాంపిటీటివ్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అయ్యేవాళ్లకు యూట్యూబ్​లో కరెంట్ అఫైర్స్, జనరల్​ నాలెడ్జ్​ క్లాస్​లు చెప్తాడు.‘శిక్లారథ్​’ అనే అకాడమీలో ఆన్​లైన్ క్లాస్​లు చెప్తుంటాడు గౌరవ్.  పోయిన సోమవారం అతని పెండ్లి జరిగింది. అయితే క్లాస్ మిస్​ అవుతానని సెలవు తీసుకోలేదు. పెండ్లి బట్టలతో ఆన్​లైన్ క్లాస్​ లైవ్​లో కనిపించిన గౌరవ్​ని చూసి స్టూడెంట్స్​ ఆశ్చర్యపోయారు. ఆన్​లైన్​లో గౌరవ్ ఫొటో చూసిన చాలామంది టీచింగ్ మీద అతని డెడికేషన్​ని మెచ్చుకుంటున్నారు. 

సెలవు ఇచ్చినా కూడా 

‘‘గౌరవ్ తన పెండ్లి గురించి ఐదు నెలల ముందే చెప్పాడు. ఐదు రోజులు సెలవు కూడా ఇచ్చాం. కానీ, ఒక్కరోజు కూడా క్లాస్ మిస్​ చేయొద్దు అనుకున్నాడు. అందుకనే పెండ్లి రోజు కూడా క్లాస్​ చెప్పాడు” అన్నాడు ‘శిక్షారథ్​’ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నిర్మల్.