రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల విద్యార్థుల ధర్నా

రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో విద్యార్థుల ధర్నా మూడవ రోజుకు చేరుకుంది. ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధులు తరగతులు బహిష్కరించి కాలేజ్ ముందు నిరసన చేపట్టారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఆవేదన చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫాం సాగు చేయాలని ప్రకటించిన సీఎం కేసీఆర్.. దానికి సంబంధించి 400 మంది హెచ్ఈవో అధికారులు ఉండాలని సూచించారు.

హెచ్ఈవో లను ఎవరు నియమిస్తారు? ఎప్పుడు నియమిస్తారు? అంటూ కేసిఆర్ ను విద్యార్ధులు ప్రశ్నించారు. మంచి ఫలితాలు రావాలంటే ఉద్యాన అధికారులు ఉండాలి. ఇప్పటి వరకు అధికారులను ప్రభుత్వం నియమించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.