రజినీ ‘పెద్దన్న’ టీజర్‌ను రిలీజ్ చేసిన వెంకీమామ

రజినీ ‘పెద్దన్న’ టీజర్‌ను రిలీజ్ చేసిన వెంకీమామ

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం అన్నాత్తే. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో పెద్దన్నగా తీసుకొస్తున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది. విక్టరీ వెంకటేశ్ పెద్దన్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ అద్భుతంగా ఉందన్న వెంకీ.. రజినీకి బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న పెద్దన్న చిత్రంలో రజినీ సరసన నయనతార, కీర్తి సురేష్ నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు మీనా, కుష్బూతోపాటు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, కమెడియన్ సూరి, సతీష్‌లు పెద్దన్నలో నటిస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.  

మరిన్ని వార్తల కోసం: 

సిటీ బస్సు ఎక్కిన సీఎం

కిలిమంజారోను అధిరోహించిన నటి నివేదా థామస్

కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై సీజేఐ అసంతృప్తి