
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్ర పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. ఆయన మరి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా కొనసాగితే బాగుండేదన్నారు. గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని అన్నారు రజనీకాంత్ . ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మార్చి 11 న రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేసన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రజనీకాంత్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు త్వరగా రాజకీయాల నుంచి దూరమవ్వడం నచ్చలేదన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దనే చెప్పానన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చానన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గం కాదని.. దానికి చాలా మార్గాలున్నాయని సూచించారు.