Thalaivar171: రజినీకాంత్ తలైవార్ 171.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన లోకేష్

Thalaivar171: రజినీకాంత్ తలైవార్ 171.. షూటింగ్ అప్డేట్ ఇచ్చిన లోకేష్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇటీవలే జైలర్(Jailer) సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. దర్శకుడు నెల్సన్ కుమార్(Nelson kumar) తెరకెక్కించిన స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమాలో రజిని యాక్షన్ అండ్ స్టైలీష్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తరువాత రజిని జై భీం దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో వెట్టయ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు.

అయినప్పటికి అందరి చూపులు మాత్రం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ తో చేయబోయే సినిమాపైనే ఉన్నాయి. తలైవార్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ గా ఫుల్ హైప్ క్రియేట్ అవుతోంది. కారణం.. కమల్ హాసన్ కి విక్రమ్, విజయ్ కి లియో వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు సూపర్ స్టార్ తో జతకట్టడమే. తన రెండు సినిమాలతో ఇద్దరు స్టార్ హీరోలకి కెరీరి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు రజినీకాంత్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసకతికరంగా మారింది.

ALSO READ | Ram Charan: మెగా ఫ్యాన్స్కి చరణ్ బర్త్డే ట్రీట్.. జరగండి సాంగ్ అప్డేట్ వచ్చేసింది

నిజానికి ఈ ప్రాజెక్టు గురించి చాలా కాలం క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ, ఇప్పటివరకు షూటింగ్ మొదలుకాలేదు. అందుకే ఈ సినిమా అప్డేట్ కోసం రజిని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తలైవార్ 171 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు లోకేష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. రజనీ సార్ తో సినిమా చేయడం ఎంతో ఆసక్తిగా ఉంది. ఆ క్షణం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. తలైవార్ 171 సినిమా నాకు చాలా స్పెషల్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. దానికి కాస్త సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. తొందరగా షూటింగ్ ఫినిష్ చేసి.. ఖైదీ 2 సినిమా షూటింగ్ మొదలుపెడతాను.. అంటూ చెప్పుకొచ్చారు లోకేష్. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.