రాజ్యసభలో రగడ.. వెంకయ్య నాయుడు సీరియస్

రాజ్యసభలో రగడ.. వెంకయ్య నాయుడు సీరియస్

రాజ్యసభ విపక్షాల ఆందోళనతో అట్టుడికింది. 12 మంది విపక్ష ఎంపీలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. అయితే ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఆయన సభలో విపక్ష ఎంపీల వైఖరిపై మండిపడ్డారు. మీకు సభ నడవడం ఇష్టం లేదని సీరియస్ అయ్యారు. సభ సజావుగా సాగాలని మీరు కోరు కోవడం లేదు. ప్రజ ధనాన్ని వెచ్చింది ప్రజా సమస్యలపై పార్లమెంట్ సమావేశాలు నడవడం మీకు ఇష్టం లేదు అంటూ సీరియస్ అయ్యారు. ఓ వైపు వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నా.. మరో వైపు ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు.