ఈ మెహందీ డిజైన్స్ తో రక్షా బంధన్ మరింత అందంగా, సంతోషంగా..

ఈ మెహందీ డిజైన్స్ తో రక్షా బంధన్ మరింత అందంగా, సంతోషంగా..

తోబుట్టువులతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా జరుపుకునే పండుగ రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి. ఈ పండుగను హిందూ మాసం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున (పూర్ణిమ) జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆగస్టు నెలలో వస్తుంది. ప్రేమ, ఆప్యాయత, శ్రేయస్సుకు చిహ్నంగా సోదరీమణులు ఈ రక్షా బంధన్ సందర్భంగా తమ సోదరుల మణికట్టు రాఖీ అనే పిలువబడే అలంకార దారాన్ని కడతారు. ఆ తర్వాత సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు అందజేస్తారు. వారిని రక్షించడానికి తామున్నామని, రక్షగా నిలుస్తామని వాగ్దానం చేస్తారు. ఈ రాఖీ సోదరీ, సోదరుల మధ్య నమ్మకాన్ని, సోదరీమణులను రక్షించేందుకు ఎప్పుడూ అండగా ఉంటాననే నిబద్దతతను సూచిస్తుంది.

ఈ రాఖీ కట్టే వేడుకలో తీపి వంటకాలు, కొత్త సాంప్రదాయ దుస్తులను ధరించడంతో పాటు మహిళలకు ఎంతో ఇష్టమైన మెహెందీని పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో కొందరు కమ డ్రెస్సింగ్ స్టైల్ కు అనుగుణంగా కూడా మెహెందీ స్టైల్ ను ఎంచుకుంటున్నారు. ఇక ఈ మెహెందీ స్టైల్స్ లో ఇండో-అరబిక్, మొరాకన్, వైట్ హెన్నా ఆర్ట్, రాజస్థానీ, పాకిస్తానీ, ఫ్లవర్స్, లేస్ గ్లోవ్‌లు, రాయల్ ప్యాటర్న్‌లు లాంటి ఎన్నో రకాలుంటాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఈ కింది వీడియోల్లో చూపించిన మెహెందీ డిజైన్లలో మీకు నచ్చిన స్టైల్ ను ఎంచుకుని, ఈ సంతోషకరమైన సందర్భాలను మరింత అందంగా మరల్చుకోండి.