RC17 Official: సుకుమార్..రామ్ చరణ్ RC17 అప్డేట్..శక్తివంతమైన శక్తులు వస్తున్నాయి

RC17 Official: సుకుమార్..రామ్ చరణ్ RC17 అప్డేట్..శక్తివంతమైన శక్తులు వస్తున్నాయి

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో మరోసారి జతకట్టనున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). లేటెస్ట్గా RC 17 వర్కింగ్ టైటిల్ తో సినిమా షురూ కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసియల్ గా అనౌన్స్ చేశారు. ఇవాళ హోలీ (మార్చి 25) సందర్బంగా విజయవంతమైన కలయికపై అప్డేట్ ఇచ్చారు.

"భూమిని బద్దలు కొట్టే అద్భుతమైన పని కోసం శక్తివంతమైన శక్తులు తిరిగి కలుస్తాయి..RC17 భారతీయ సినిమాకు కొత్త రంగులను జోడించడానికి సిద్ధంగా ఉంది" అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో రెండు జోడు గుర్రాలకి సంబంధించిన ఫోటో ఆసక్తి రేపుతోంది. ఈ లేటెస్ట్ అప్డేట్ తో RC 17 మూవీపై అంచనాలు మొదలయ్యాయి.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. 

ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అలాంటి కాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. 

అయితే..ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీనీ ప్లాన్ చేశాడు సుకుమార్. కానీ, ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే క్లారిటీ ఇంతవరకు రాలేదు. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో సినిమా చేస్తారు రామ్ చరణ్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కాబట్టి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది.