కోహ్లీ బయోపిక్లో నటిస్తా: రామ్​ చరణ్​

కోహ్లీ బయోపిక్లో నటిస్తా: రామ్​ చరణ్​

టీమిండియా కోహ్లీ బయోపిక్​లో నటిస్తానని నటుడు రామ్​ చరణ్​ తెలిపారు. ఢిల్లీలోని ఓ ఛానల్​ సదస్సుకు హాజరైన ఈ మెగా హీరో ఈ విధంగా స్పందించారు. ‘నాటు నాటుకు ఆస్కార్ ​గెల్చుకుంది. ఇది భారతీయుల పాట. ఆస్కార్​ అవార్డు పొందడం గొప్ప విషయం. దేశం తరఫున మేము అక్కడ పాల్గొన్నాం’అని చరణ్ చెప్పారు. 

‘17 రోజులపాటు నాటు సాంగ్​ షూట్​ జరిగింది. ఉక్రెయిన్​కు 7 రోజులు ముందుగా చేరుకున్నాం. నేను, తారక్​ కష్టతరమైన స్టెప్పులకు డ్యాన్స్​ ప్రాక్టీస్​ చేశాం. అలా సాయంత్రం ప్రాక్టీస్​ చేసేవాళ్లం. ఉదయం షూట్​ జరిగేది. ఇదే ఇవాళ మ్యాజిక్​ చేసింది. అందుకుదగ్గ ప్రతిఫలం కూడా దక్కింది’అని తెలిపారు. తన ఫేవరెట్​ నటుడు సల్మాన్​ ఖాన్​ అని, తన సతీమణి ఉపాసనకు మాత్రం షారుఖ్ ఖాన్​ ఫేవరెట్ అని రామ్ చరణ్ తెలిపారు.